Police Security to Tomato Lorry : బోల్తా పడిన టమాటా లారీ.. పోలీసుల కాపలా - tamoto security video

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 15, 2023, 8:35 PM IST

Police security to Tomato lorry in Adilabad : టమాటా.. ప్రస్తుతం ఈ మాట పలకాలంటే సామాన్యులు కాస్త ధైర్యం చేయాల్సిందే. నేడు కేజీ టమాటా ధర.. కిలో ఆపిల్​ రేట్​ను దాటేసింది. టమాటాలు కొనుగోలు చేసే వారిని ధనవంతులుగా వర్ణిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో మీమ్స్​ సైతం పుట్టుకొస్తున్నాయి. పెరిగిన ధరలతో నేడు టమాటా ఎలా మారిందంటే.. బోల్తా పడ్డ లారీ వద్ద ఎవరూ దొంగిలించకుండా పోలీసులు కాపలా ఉండేలా అవతారమెత్తింది. ఈ ఘటన ఆదిలాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది. 

కర్ణాటక నుంచి దిల్లీకి తరలిస్తున్న టమాటాల లారీ.. ఆదిలాబాద్ జిల్లా మావల సమీపంలోని జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఎదురుగా వచ్చిన బైక్​ను తప్పించబోయి ఈ ప్రమాదం జరిగింది. లారీ బోల్తా పడ్డ ఘటనలో స్వల్ప గాయాలతో అందులోని డ్రైవర్, ఇతరులు బయటపడ్డారు. దాదాపు రూ.28 లక్షల విలువ చేసే టమాటాలు లారీలో ఉన్నట్లు తెలుస్తోంది. లారీ యజమాని అభ్యర్థన మేరకు స్థానికులెవరూ వాటిని ఎత్తుకెళ్లకుండా పోలీసులు కాపలాగా ఉన్నారు. టమాటా ధరలు అకాశాన్నంటుతున్న నేపథ్యంలోనే పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని యజమాని తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.