తెలంగాణపై చలి పంజా - రానున్న రెండ్రోజులు గజగజ
🎬 Watch Now: Feature Video
Telangana Weather News Today : రాష్ట్రంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవటంతో జనాలు వణికిపోతున్నారు. ఉత్తరాది నుంచి వీస్తున్న బలమైన శీతల గాలుల వల్లే చలితీవ్రత పెరుగుతోందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. రాత్రి పూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు.
Fog Alert in Telangana : పలు జిల్లాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 దాటినా సూర్యుడు రాకపోవడంతో చలితో ప్రజలు వణికిపోతున్నారు. జనవరి 1 నుంచి చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలో చలి తీవ్రతతో పాటు, దట్టమైన పొగ మంచు అలుముకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వాహనదారులు మరింత జాగ్రత్త వహించాలని సూచించారు.