Ramzan : రంజాన్ స్పెషల్ 'అలయ్ బలయ్'.. సామూహిక ప్రార్థనలతో సందడి - Old city Makkamasid
🎬 Watch Now: Feature Video
Ramzan celebrations in Telangana: పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థనా మందిరాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీ, మాసబ్ ట్యాంక్ హాకీ మైదానం, సికింద్రాబాద్, రాణిగంజ్, మిరాలం ఈద్గా, చార్మినార్ పరిసర ప్రాంతాలతో పాటు తదితర చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.
సనత్ నగర్లోని వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్, బన్సీలాల్పేట బోయగూడలోని క్యూబా మసీదు వద్ద ప్రార్థనలdలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ప్రార్ధనల అనంతరం ముస్లీం సోదరులను ఆలింగనం చేసుకొని.. మంత్రి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా ఆశీస్సులతో ప్రపంచం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
రంజాన్ పండగ పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని వద్ద గల ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటల నుంచి నూతన వస్త్రాలు ధరించి ఈద్గాకు చేరుకుని ప్రార్ధనలు చేశారు.