కాంగ్రెస్ మా బిడ్డలను చంపింది - రాహుల్ రాకకు వ్యతిరేకంగా బోధన్‌లో పోస్టర్లు - Posters Against Rahul Gandhi in Bodhan
🎬 Watch Now: Feature Video
Published : Nov 25, 2023, 12:17 PM IST
Posters Against Rahul Gandhi in Bodhan : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో.. ప్రధాన పార్టీలు అగ్రనేతలతో ప్రచారం ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిర్వహించే విజయభేరి సభకు రానున్నారు. ఈ నేపథ్యంలో నేతలు సభ ఏర్పాట్లు పరిశీలించారు. మరోవైపు పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో స్టేజ్ ప్రాంగణాన్ని తనిఖీ చేశారు.
ఓ వైపు సభకు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు బోధన్‌లో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలవడం కలకలం సృష్టిస్తోంది. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఫొటోలతో.. కాంగ్రెస్‌ను విమర్శిస్తూ గోడలకు పోస్టర్లు వెలిశాయి. 'బలిదానాల బాధ్యత కాంగ్రెస్‌దే.. మా బిడ్డలను చంపింది కాంగ్రెస్' అంటూ.. 'కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందే.. ముక్కు నేలకు రాయాల్సిందే' అని డిమాండ్ చేస్తూ పోస్టర్లలో రాసి ఉంది. కర్ణాటక కరెంటు కష్టాలు, నిరుద్యోగాన్ని ఎండగట్టిన వైనం, బళ్లారిలో జీన్స్ పరిశ్రమల విద్యుత్తు కోతలపై.. కన్నింగ్ కాంగ్రెస్ మనకు అవసరమా అంటూ.. ప్రశ్నలతో కూడిన పోస్టర్లు గోడలకు అతికించారు.