Bike Stunts in Hyderabad : లైకుల కోసం బైకుతో స్టంట్స్.. పోలీసులు మామూలుగా ఇవ్వలేదుగా..! - Madapur Cable Bridge Bike Stunt person
🎬 Watch Now: Feature Video
Police arrest Bike stunts person in Hyderabad : హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై కుర్రకారు బైక్ స్టంట్స్ వీడియో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియోలో లైకుల కోసం యువత రాత్రి సమయాల్లో చేస్తున్న ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. ఇలాగే ఇటీవల తీగల వంతెన వద్ద ఓ యువకుడు స్టంట్స్ చేశాడు. ఆ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో చూసిన ఆ ఏరియా ట్రాఫిక్ పోలీసులు.. వాహనం నెంబర్ సాయంతో ఆ యువకుడిని పట్టుకున్నారు. మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనంతరం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి.. ఇలాంటివి ఎవరూ చేయొద్దంటూ అతడితోనే చెప్పించారు. 'నేను ఇకపై ఇలాంటి స్టంట్స్ చేయను.. ఇతరులు కూడా ఇలా చేయవద్దని కోరుతున్నా' అంటూ సదరు యువకుడు తెలిపాడు.
సామాజిక మాధ్యమాల్లో లైకుల కోసం.. ఇతరుల ఆనందం కోసం ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయరాదని.. చట్టరీత్యా నేరమని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇలాంటి వారి వల్ల ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడతారని.. సీసీ కెమెరాల్లో ప్రతి దృశ్యం రికార్డ్ అవుతుందని.. బైకులతో స్టంట్స్ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.