Monkey funeral Bhupalpally : భవనంపై నుంచి కిందపడి కోతి మృతి.. వానరానికి యజమాని కన్నీటి వీడ్కోలు - Villagers who cremated the dead monkey
🎬 Watch Now: Feature Video
Published : Sep 23, 2023, 4:06 PM IST
Monkey funeral Bhupalpally : పక్కన మనిషి చనిపోయినా చూసీ చూడనట్లు వెళ్లిపోయే కలియుగంలో మానవుడు బతుకుతున్నాడు. ఎంతసేపు తన స్వార్థమే తప్ప.. అవతలి వ్యక్తి ఎలాంటి సమస్యల్లో ఉన్నా పట్టించుకునే తీరక లేదు ఈ తరం వాళ్లకు. కనీసం రోడ్డు ప్రమాదంలో ఎవరైనా గాయపడినా, చనిపోయినా మనకెందుకులేనని వదిలేసి పక్క నుంచి వెళ్లిపోయే సమాజంలో బతుకుతున్నాం.
ఇలాంటి సమాజంలో ఇప్పటికీ మానవత్వం బతికే ఉందని కొన్ని సంఘటనలు అప్పుడప్పుడూ నిరూపిస్తుంటాయి. అలాంటి సంఘటనే జయశంకర్ భూపాలపల్లిలో చోటుచేసుకుంది. ఓ ఇంటి పై నుంచి వానరం కిందపడి మృతి చెందితే గ్రామస్థులంతా ఘనంగా దహన సంస్కారాలు నిర్వహించారు. టేకుమట్ల మండలం రామకృష్ణాపురంలో ఈ సంఘటన జరిగింది.
గ్రామంలో గుంపులు గుంపులుగా తిరుగుతున్న వానరాల్లో ఒక కోతి మల్లయ్య అనే వ్యక్తి ఇంటిపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. కోతి మృతదేహన్నిచూసి మల్లయ్య కన్నీరు పెట్టుకున్నారు. గ్రామస్థుల సాయంతో సాంప్రదాయబద్ధంగా డప్పులతో ఊరేగింపుగా తీసుకపోయి దహన సంస్కరాలు నిర్వహించారు. గ్రామస్థులంతా కోతి మృతితో కన్నీటి పర్యంతమయ్యారు.