MLA Mutthireddy Fires on Palla : పల్లా భూ కబ్జాలన్నీ ఆధారాలతో సహా నిరూపిస్తా: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి - MLA Muthireddy Yadagiri Reddy agitation Jangaon
🎬 Watch Now: Feature Video
Published : Sep 2, 2023, 4:50 PM IST
MLA Mutthireddy Fires on Palla Rajeshwar Reddy : బీఆర్ఎస్ దళిత కార్యకర్తపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వర్గం.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వర్గం జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టింది. ఎమ్మెల్యే వర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు.. గో బ్యాక్ పల్లా, దళిత ద్రోహి పల్లా అంటూ నినాదాలు చేశారు. అర్ధనగ్న ప్రదర్శనతో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై.. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విమర్శలు (Mutthi Reddy Comments on Palla Rajeshwar Reddy) గుప్పించారు. దళితులపై కేసులు పెట్టడం అంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలకు వెన్నుపోటు పొడవడమే అని ఆరోపించారు. ఎస్సీలపై పెట్టిన కేసుపై.. శిరస్సు వంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున క్షమాపణలు కోరుతున్నానని ఎమ్మెల్యే అన్నారు. మరోవైపు బీబీనగర్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి 284 మంది అభాగ్యుల పొట్ట కొట్టి భూకబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయం ఆధారాలతో సహా నిరూపిస్తానని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వెల్లడించారు.