BRS and MIM Clash in Nizamabad : పట్టణ ప్రగతి కార్యక్రమంలో బీఆర్​ఎస్, ఎంఐఎం మధ్య ఘర్షణ

🎬 Watch Now: Feature Video

thumbnail

BRS and MIM clash in Nizamabad : రాష్ట్రంలో బీఆర్​ఎస్​, ఎంఐఎం పార్టీలు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి మిత్ర పక్షాలనే విషయం అందరికీ తెలిసిందే. కానీ నిజామాబాద్​ జిల్లా బోధన్​లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ కౌన్సిలర్లు గందరగోళం సృష్టించారు. ఫలితంగా కార్యక్రమంలో ఎంఐఎం, బీఆర్​ఎస్​ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 

ఎంఐఎం కౌన్సిలర్లు, నాయకులు పట్టణంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆర్డీవో రాజేశ్వర్​ను నిలదీశారు. పట్టణ ప్రగతి అంటే పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి.. కానీ ఇక్కడ అదీ కూడా జరగలేదని ఎంఐఎం కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపల్​ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు సభాస్థలి నుంచి ఎంఐఎం నాయకులను అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే డౌన్​డౌన్​ అంటూ నినాదాలు చేస్తూ.. అక్కడి నుంచి కార్యకర్తలు వెళ్లిపోయారు. స్థానిక ఎమ్మెల్యే షకీల్​ ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడం.. రూరల్​లో పాల్గొనడం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.