Mega Drone Show in Siddipet: ఈ నెల 27 న మెగా డ్రోన్‌షో.. బీఆర్ఎస్ పాలనలో సాధించిన అభివృద్ధిపై ప్రదర్శన - కోమటి చెరువు డ్రోన్‌షో
🎬 Watch Now: Feature Video
Published : Aug 26, 2023, 3:56 PM IST
Mega Drone Show in Siddipe : సిద్దిపేట పేరు వినగానే మనుకు వెంటనే గుర్తువచ్చేది ఆకర్షణీయంగా అందరి మనసు దోచుకొనే కోమటి చెరువు. లేజర్‌షో, హ్యాంగింగ్ బ్రిడ్డ్ వంటి ఎన్నో విశేషాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. తాజాగా మరో అద్భుతానికి సిద్దిపేట కోమటి చెరువు వేదికగా ముస్తాబవుతోంది. ఈ కార్యక్రమం మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో జరగనుండగా, ప్రముఖ సింగర్ గీతామాధురి హాజరై తన పాటలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 27 వ తేదీన నిర్వహిస్తున్నారు. అకాశమంత ఎత్తులో జిల్లా అభివృద్ధిని తెలియజేసే విధంగా 4500 డ్రోన్‌షో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంత భారీ ఎత్తున డ్రోన్‌షో ఏర్పాటు చేయనుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జిల్లా లో సాధించిన ప్రగతిని సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా రంగురంగుల వర్ణాలతో అందరికీ ఆకట్టుకునేలా చిత్రీకరించనున్నారు. కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున హాజరై ఈ ప్రదర్శన ను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.