Selfie Suicide In Hanamkonda : 'నా లవర్​, ఆమె ఫ్రెండ్ వేధింపుల వల్లే చనిపోతున్నా' - సెల్ఫీ సూసైడ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 21, 2023, 10:24 AM IST

Updated : May 21, 2023, 12:16 PM IST

Youngman Selfie Suicide In Hanamkonda : తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని.. ఆ బాధను తట్టుకోలేకపోతున్నానంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్​ గ్రామానికి చెందిన మండ సాయిచరణ్(24) అనే యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందంటూ సెల్ఫీ వీడియో తీసుకుని.. ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రేమించిన అమ్మాయి, ఆమె స్నేహితుడు కలిసి గత 4 నెలలుగా తనను మానసికంగా, శారీరకంగా హింసించడం వల్లే ప్రాణాలు తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఆమె ప్రతి బర్త్​డే రోజున తన చావు గుర్తుకురావాలని.. అందుకోసమే ఇన్ని రోజులు ఆగానని చెప్పాడు. ప్రియురాలి పుట్టినరోజున అర్ధరాత్రి ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం చనిపోతున్నట్లు పేర్కొన్నాడు. అక్క, బావ, అమ్మ, నాన్న, స్నేహితులందరూ క్షమించండి అంటూ వీడియోలో తెలుపుతూ ఫ్యాన్​కు ఉరేసుకొని తనువు చాలించాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : May 21, 2023, 12:16 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.