రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు పట్టించుకోని బీజేపీకి ఓట్లు ఎందుకు వేయాలి : కేసీఆర్ - కేసీఆర్ స్పీట్ ఎట్ సంగారెడ్డి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-11-2023/640-480-20127430-thumbnail-16x9-kcr-meeting.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Nov 27, 2023, 7:20 PM IST
KCR Election Campaign in Sangareddy : రాష్ట్రంలో కుల మత ప్రాంతీయ బేధాలు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద సభ(Praja ashirvada Sabha)లో కేసీఆర్ పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా అడ్డుపడిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణను ముంచే ఉద్దేశ్యంతో మళ్లీ ఓట్లు అడుగుతోందని పేర్కొన్నారు. సంగారెడ్డి బీఆర్ఎస్(BRS) అభ్యర్థి చింతా ప్రభాకర్‌కు మద్దతుగా ప్రచారం చేశారు.
KCR Public Meeting in Sangareddy : కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల్లో చేయని అభివృద్ది.. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏమి చేస్తారని కేసీఆర్(KCR) ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు పట్టించుకోని బీజేపీకు ఓట్లు ఎందుకు వేయాలని నిలదీశారు. బీజేపీకు ఓటు వేస్తే మేనిఫెస్టోలో ఉన్న అన్ని పథకాలు అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సంగారెడ్డి మెడికల్ కాలేజ్‌తో పాటు 450 పడకల ఆస్పత్రి నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని అన్నారు.