తెలంగాణను కప్పేసిన మంచు దుప్పటి - గజగజ వణుకుతున్న ఏజెన్సీ ప్రాంతాలు - Heavy fog fall
🎬 Watch Now: Feature Video


Published : Dec 27, 2023, 6:34 AM IST
Heavy Snow Fog in Telangana Today : తెలంగాణపై చలిపులి పంజా విసురుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉదయం పూట బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. పలు ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేస్తోంది. గత మూడు రోజుల నుంచి పెరిగిన చలితో పలు ప్రాంతాల్లోని గ్రామాలన్నీ వణుకుతున్నాయి. ముఖ్యం గా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు.
Telangana Temperature Today Live News 2023 : భద్రాద్రి కొత్తాగూడెం, సిద్దిపేట, వరంగల్ జిల్లాలతో పాటు మిగతా జిల్లాలనూ పొగమంచు కప్పేసింది. దట్టమైన పొగ మంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి కనిపించక అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజాము సమయంలో అయితే అసలు వాహనలైట్లు వేసినా రోడ్డు కనిపించడం లేదని వాపోతున్నారు. కొన్నిసార్లు ప్రయాణాలు మానుకుని వెనక్కి తిరగాల్సి వస్తోందని చెబుతున్నారు.
చాలా ప్రాంతాల్లో తెల్లవారుజామునే పని ఉన్నా పొగమంచు వల్ల పనులు మానేసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లిన వారు దట్టంగా పొగ మంచు అలుముకున్న సమయంలో చేసేదేమి లేక మంచు తేరుకున్నాక వెళ్దాం లే.! అని వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేసి చలికి గజగజ వణుకుతున్నారు.