Ganja Smuggling Gang Arrested at Bhadrachalam : సినీఫక్కీలో గంజాయి స్మగ్లింగ్​.. కారు ఇంజిన్​లో దాచి మరీ.. - భద్రాచలంలో 22 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2023, 9:43 AM IST

Ganja Smuggling Gang Arrested at Bhadrachalam : గంజాయి రవాణాకు కేటుగాళ్లు నయాదారులు వెతుకుతున్నారు. సినీఫక్కీల్లో సరకు రవాణా చేస్తూ తనిఖీల్లో పట్టుబడుతున్నారు. ఫలితంగా కటకటాల పాలవుతున్నారు. గంజాయి ప్యాకెట్లను కారు ఇంజిన్‌ భాగంలో అమర్చి తరలిస్తుండగా భద్రాచలం పోలీసులు పట్టకున్నారు. ఎన్నికల దృష్ట్యా భద్రాచలం కూనవరం చెక్‌పోస్ట్(Police Checking Kunavaram Check Post) వద్ద అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం నగరానికి చెందిన షేక్ నన్నే సాహెబ్, వర్థన్, గోపి అనే ముగ్గురు యువకులు కారు ముందు భాగంలో గంజాయి ప్యాకెట్లను అమర్చి తరలిస్తున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. 

Police Seized 22 KGS Ganja Bhadrachalam : నిందితుల నుంచి రూ.3.55 లక్షలు విలువ చేసిన 22 కేజీల 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మొత్తం ఆస్తుల విలువ రూ.9,21,500లు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సరుకు తరలిస్తున్న హ్యూందాయ్‌ కారుతో పాటు మొబైల్​ ఫోన్​లను సీజ్‌ చేసి.. నిందితులను అరెస్టు చేశారు. మరో వ్యక్తి వద్ద.. సరైన పత్రాలు లేకపోవడంతో రూ.2,83,300లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.