హాకీలో సత్తా చాటుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.. మెరికల్లా తీర్చిదిద్దుతున్న పీఈటీ
🎬 Watch Now: Feature Video
Special Story on Thoompally Hockey Students : సాధారణంగా బడిలో ఆటల కోసం ఒక పీరియడ్ ఉంటుంది. పిల్లలు దానికోసం రోజంతా ఎదురుచూస్తుంటారు. ఇది సర్వసాధారణమే కానీ ఆ పాఠశాల మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఆ స్కూల్లో ఆటల పీరియడ్ కోసం ఎదురుచూడడం కాదు. ఆ పీరియడ్ కోసమే విద్యార్థులు బడికి వస్తుంటారు. కేవలం ఆటలలో మాత్రమే కాదు చదువులోను ముందుంటున్నారు. ఎక్కడ టోర్నీ జరిగినా వారు లేని జట్టును ఊహించలేనంతగా ఈ విద్యార్థులు రాణిస్తున్నారు. పిల్లలకు ఆటలపై అంత ఇష్టం కలిగించిన ఆ వ్యక్తి నిజామాబాద్ జిల్లాలోని తూంపల్లి జడ్పీహెచ్ఎస్లో పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మారుమూల ప్రాంతంలోనే మట్టిలో మాణిక్యాలు పుడతారనే మాటను తాను బలంగా నమ్ముతానంటున్నాడు ఆ యువకుడు. ఇంతకీ ఆ పిల్లలకు ఆటలపై అంత ఇష్టం కలిగించిన వ్యక్తి ఎవరు..? వారు ఆడుతున్న ఆట ఏంటి ..? అసలు గతంలో ఆ ఆట తెలియని విద్యార్థులను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం..