PRATHIDWANI.. గృహహింస కేసుల్లో తెలంగాణ 2వ స్థానం.. దేనికి సంకేతం? - Protection of women
🎬 Watch Now: Feature Video
Domestic Violence Act: గృహ హింస కేసుల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది మన రాష్ట్రం. ఇటీవల వెలుగు చూసిన ఇందుకు సంబంధించిన నివేదికపైనే అందరిలో కలవరం వ్యక్తం అవుతోంది. గడిచిన రెండేళ్లలోనే ఈ గణాంకాలు ఊహించని రీతిలో పెరగడం ఆందోళన కలిగిస్తున్న మరో విషయం. నా అనుకున్న ఇంటిలోనే మహిళలపై హింసకు సంబంధించిన ఈ గణాంకాలు దేనికి సంకేతం? తిట్టడం, కొట్టడమే కాదు.. అపహరణలు, అత్యాచార ప్రయత్నాలు అధికం కావడాన్ని ఎలా చూడాలి? మహిళల రక్షణకు ఉన్న చట్టాలు ఏం చెబుతున్నాయి? వాటి ద్వారా ఇలాంటి వేధింపులు, హింస నుంచి ఊరట పొందడానికి ఆడవారికి ఉన్న మార్గాలు ఏమిటి? గృహహింస కేసుల్లో దేశంలోనే మొదటి స్థానంలో అసోం ఉండగా.. మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. ఉన్నత విద్యావంతులైన వారినుంచీ ఊహించని ప్రవర్తనలు ఎదురవుతున్నాయి. నా అనుకున్న ఇంటిలోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. బిక్కుబిక్కుమంటు కాలం వెళ్లదీయాల్సిన దయనీమైన స్థితి మహిళలకు నెలకొంది. ఈ హింసను అరికట్టడానికి తక్షణం తీసుకోవాల్సిన చర్యలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.