'హుజురాబాద్ ఎన్నికల ఫలితాలనే గజ్వేల్‌లోనూ పునరావృతం చేయండి'
🎬 Watch Now: Feature Video
Etela Rajender Sensational Comments on KCR : సీఎం కేసీఆర్ పీడ పోవాలంటే ఆయన ఓడిపోవాలని.. అందుకే గజ్వేల్‌లో తాను పోటీ చేస్తున్నట్లు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. నియోజవర్గంలో ప్రచారం నిర్వహించిన ఆయన.. గత హుజురాబాద్ ఎన్నికల ఫలితాలను గజ్వేల్‌లోనూ పునరావృతం చేయాలని ప్రజలను అభ్యర్థించారు. కేసీఆర్ ఎలాగైతే ఒక్కసారి ఓడిపోలేదు.. ఇక్కడ కూడా ఓడిపోను అని అనుకుంటున్నారో.. అదేవిధంగా తాను కూడా ఒక్కసారి కూడా ఓడిపోలేదని.. గెలుపు ఓటములను నిర్ణయించేది ప్రజలని బీజేపీ నేత, గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని బంధారం గ్రామంలో ఈటల ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈక్రమంలో ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను బయటకు పంపించాక.. అసెంబ్లీలో చూడకూడదని హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తనను ఓడించడానికి రూ.6 వేల కోట్లు ఖర్చుబెట్టారని.. కానీ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపించారని ఈటల అన్నారు. ఈ పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. మన పిల్లలు ఉద్యోగాల కోసం కష్టపడి చదువుతుంటే.. మీకు కాదు పైరవీ చేసుకున్న వారికి మాత్రమే ఉద్యోగాలు అని అన్నట్లు ఈ ప్రభుత్వం నడుచుకుంటుందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.