దీపావళి పండగ సందడి - వినియోగదారులతో కిటకిటలాడుతున్న మార్కెట్లు - manchu laxmi diwali Celebrations
🎬 Watch Now: Feature Video
Published : Nov 11, 2023, 2:16 PM IST
Diwali Festival Rush At Markets In Telangana : రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వెలుగుల పండుగ దీపావళి సందడి మొదలైంది. ప్రమిదలు, టపాసుల కొనుగోలుతో మార్కెట్‌లో పండుగ వాతావరణం నెలకొంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దీపావళి రోజు పేద, ధనిక అనే తేడా లేకుండా ఇళ్లలో దీపాలతో అలంకరించేందుకు ప్రమిదలు కొంటున్నారు. రూ.4 రూపాయల నుంచి రూ.400 రూపాయల వరకు వినియోగదారుల ఆసక్తి మేరకు వాటిని విక్రయిస్తున్నారు.
అలాగే ఎలక్ట్రిక్ దివ్వెలు, దీపపు ప్రమిదలు, బొమ్మల కొలువు కోసం వాడే బొమ్మలు, ఇతర పండగ సామాగ్రి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ అనుమతితో క్రాకర్స్‌ను విక్రయిస్తున్నామని.. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ తీసుకుంటున్నామని అమ్మకదారులు అంటున్నారు. హైదరాబాద్‌లోని టీచ్ ఫర్ చేంజ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి సినీ నటి మంచు లక్ష్మి తన నివాసంలో సంబురాలు జరుపుకున్నారు. నిరుపేద పిల్లలకు స్ఫూర్తి, ఆనందం కలిగించేందుకు ఈ వేడుకలను నిర్వహించినట్లు మంచు లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేస్తూ ఆనందంగా గడిపారు.