ఎనుమాముల మార్కెట్ యార్డు ఎదుట మిర్చి రైతుల ధర్నా - వ్యాపారులు దగా చేస్తున్నారంటూ ఆవేదన
🎬 Watch Now: Feature Video
Dharna Of Pepper Farmers In Warangal : వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట మిర్చి రైతులు ధర్నాకు దిగారు. మిర్చి కొనుగోళ్లలో వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ వ్యవసాయ మార్కెట్ గేటు ముందు బైఠాయించారు. సీజన్ ఆరంభంలో మిర్చి మార్కెట్లో ధరల దగా అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సీజన్ ఆరంభం నుంచి అనేక కష్టాలు, నష్టాలే మిర్చి రైతులను వెంటాడుతున్నాయి.
Chili farmers Demand to Minimum Support Price : అధిక వర్షాలు, తెగుళ్లతో దిగుబడులు గణనీయంగా తగ్గగా, మార్కెట్కు తీసుకొస్తే వ్యాపారులు కుమ్మక్తై కనీస మద్దతు ధర చెల్లించకుండా తక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేజ రకం మిర్చి క్వింటాకు రూ.21 వేలు మార్కెట్లో పలుకుతుండగా, కేవలం రూ.13 వేలకు మాత్రమే అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులంతా మార్కెట్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టడంతో కాసేపు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.