Looting Milk In Milk Tanker At Nalgonda : ప్రమాదానికి గురైన పాల ట్యాంకర్.. క్యాన్లు, బిందెలు, బకెట్లతో పాలు లూటీ - పాల ట్యాంకర్‌లోని పాలను దోచుకెళుతున్న స్థానికులు
🎬 Watch Now: Feature Video
Damaracharla Locals Looting Milk In The Milk Tanker : పాలతో వెళుతున్న పాల ట్యాంకర్‌ను ప్రైవేట్ బస్సు ఢీ కొట్టడంతో.. అందులోని పాలను స్థానికులు తీసుకొని వెళ్లిపోయారు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలోని దామరచర్ల వద్ద జరిగింది. ఈరోజు తెల్లవారు జామున ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నుంచి హైదరాబాద్‌కు పాలతో పాల ట్యాంకర్ వస్తోంది. సరిగ్గా దామరచర్ల వద్దకు వచ్చే సరికి ముందు వెళుతున్న ప్రైవేట్ బస్సును.. పాల ట్యాంకర్ ఢీ కొట్టింది.
దీనితో ట్యాంకర్ ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో పాటు.. వెనుక ఉన్న పాల ట్యాంకర్ పగిపోయింది. ట్యాంకర్ పగలడం వల్ల అందులోని పాలు రోడ్డుపై పారుతున్నాయి. ఇది గమనించిన అటుగా వెళుతున్న స్థానికులు.. ట్యాంకులోని పాలను అందిన కాడికి ఎత్తుకెళ్లారు. అందులోని పాలను క్యాన్లు, బిందెలు, బకెట్లతో తీసుకెళ్లారు. పాల ట్యాంకర్‌ను నడుపుతున్న డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో.. చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై దామరచర్ల పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.