Currency Ganesh in Warangal : రూ.2.25 కోట్ల కరెన్సీతో బొజ్జ గణపయ్య అలంకరణ.. ఆ డబ్బుని ఏం చేస్తారో తెలుసా? - తెలంగాణ న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Sep 23, 2023, 4:33 PM IST
Currency Ganesh in Warangal : వరంగల్ నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి. మండపాల నిర్వాహకులు వినూత్న సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివనగర్‌లోని వాసవి కాలనీకి చెందిన వినాయక ట్రస్ట్ సభ్యులు శుక్రవారం పురస్కరించుకొని ధనలక్ష్మి పూజ నిర్వహించారు. అందుకోసం రూపాయి నోట్‌తో మొదలుకొని మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. రూ.50 నోట్లతో పాటు రూ.100 నోట్లను మాలలుగా చేసి మండపానికి అలంకరించారు.
RS.500 Notes Vinayaka at Shiva Nagar in Warangal : రూ.200, రూ.500 నోట్లను ప్రత్యేకంగా మాల రూపొందించారు. సుమారు ఈ అలంకరణ కోసం సుమారు రెండు కోట్ల 25 లక్షల రూపాయలను ట్రస్ట్ సభ్యులు ఉపయోగించినట్లు తెలిపారు. ముంబైకి చెందిన కళాకారులను ప్రత్యేకంగా పిలిపించి కరెన్సీతో అలంకరణ చేసినట్లు వినాయక ట్రస్ట్(Vinayaka Trust) అధ్యక్షుడు దామోదర్ తెలిపారు. ట్రస్ట్ సభ్యుల నుంచి తమకు తోచినంతగా నగదును తీసుకుంటామని వ్యాఖ్యానించారు. అనంతరం ఆ డబ్బును తిరిగి ట్రస్టు సభ్యులకు అందిస్తామని తెలిపారు.