మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన కాంగ్రెస్ను మరవద్దు : జగ్గారెడ్డి - Women Happy in Bus Free Service in Telangana
🎬 Watch Now: Feature Video
Published : Dec 9, 2023, 10:42 PM IST
Congress Leader Jagga Reddy Chit Chat With Passengers in RTC Bus : మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ పార్టీని జీవితంలో మరిచిపోవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సోనియాగాంధీ జన్మదినం రోజున మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభించిన నేపథ్యంలో ఆయన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ నుంచి రుద్రారం గ్రామం వరకూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ క్రమంలో ప్రయాణ సౌకర్యంపై మహిళల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. మహిళలను టికెట్ లేకుండా ఉచితంగానే ప్రయాణిస్తున్నారా అని అడిగారు.
సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఈ అవకాశం కల్పించారన్నారు. ఉచిత మహిళలు హర్షం వ్యక్తం చేయడంతో పాటు ఈ సౌకర్యం కల్పించడం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. అనంతరం జగ్గారెడ్డి ఒక రోజూ ట్రిప్కు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తారని కండక్టర్ రాజును అడిగితెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే నిలబెట్టుకుంటుందని ఆయన ప్రయాణికులతో చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షలు ఇస్తారని సొంత డబ్బులు ఖర్చు చేయకుండా ఈ సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తాను ఓడినా సంగారెడ్డికి మెట్రో రైలు కూడా వచ్చేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
TAGGED:
Telangana latest News