BRS minister Walks Barefoot For KCR : కేసీఆర్ పేరు టాటూ వేయించుకున్న మంత్రి.. కాళ్లకు బొబ్బలు వచ్చినా.. - BRS minister Walks Barefoot For KCR Hattrick win
🎬 Watch Now: Feature Video
BRS minister Walks Barefoot For CM KCR's Hattrick win : తెలంగాణ ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ మూడోసారి కూడా ఘన విజయం సాధించాలని రాష్ట్ర మంత్రి సత్యవతి రాఠోడ్ ఆకాంక్షించారు. కేవలం కోరుకోవడమే కాదు.. అందుకోసం ఆమె ఓ దీక్ష చేపట్టారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవ్వాలనే తన కోరిక నెరవేరేంత వరకు పాదరక్షలు వేసుకోకుండా నడుస్తానంటూ దీక్షకు పూనుకున్నారు. అయితే పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమె చెప్పులు లేకుండా నడుస్తుండటం వల్ల సత్యవతి రాఠోడ్ అరికాళ్లకు బొబ్బలు వచ్చాయి. ఇటీవల ములుగు జడ్పీ ఛైర్మన్ జగదీశ్ అంత్యక్రియల్లో పాల్గొని 3 కిలోమీటర్లు ఆమె మండుటెండలో చెప్పులు లేకుండా నడిచారు. రెండ్రోజుల క్రితం కేసముద్రంలో నిర్వహించిన మహిళా దినోత్సవం సందర్భంగా ప్రదర్శనలోనూ పాల్గొన్నారు.
అంతే కాదు.. సత్యవతి రాఠోడ్.. కేసీఆర్.. ఇన్షియల్స్ను తన చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నారు. పచ్చబొట్టు వేసేటప్పుడు నొప్పితో ఆమె కంటతడి పెట్టారు. మరోవైపు తన కాళ్లకు బొబ్బలు వచ్చినా వాటిని లెక్క చేయకుండా మండుటెండల్లోనూ మొక్కవోని పట్టుదలతో చెప్పులు లేకుండానే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.