BJP Assembly Constituency Level Committee Meeting : 'బీజేపీ కార్యకర్తలు.. కేసీఆర్ మైండ్ గేమ్ ట్రాప్‌లో పడొద్దు' - తెలంగాణ బీజేపీ
🎬 Watch Now: Feature Video
Published : Aug 31, 2023, 10:46 PM IST
BJP Assembly Constituency Level Committee Meeting in Nalgonda : రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబ పాలనను గద్దె దించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనే సాధ్యమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్గొండ బీజేపీ కార్యాలయంలో జరిగిన అసెంబ్లీల నియోజకవర్గ స్థాయి కమిటీ సమావేశంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ తరుణ్ చుగ్‌తో పాటు ఆయన పాల్గొన్నారు.
రాబోయే రోజుల్లో కేసీఆర్‌ను గద్దె దించాలంటే బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. ప్రధాని మోదీ, అమిత్ షా నాయకత్వంలోనే మళ్లీ ప్రజాస్వామ్యాన్ని కాపాడి నీతివంతమైన పాలన అందించాలని.. ఇందుకోసం తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజల మనసులో ఉన్న ఆలోచనను, విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ కార్యకర్తలు.. కేసీఆర్ మైండ్ గేమ్ ట్రాప్‌లో పడొద్దని హితవు పలికారు. నల్గొండ జిల్లాలో బీజేపీని బలోపేతం చేసి కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎలాగైనా నల్గొండలో బీజేపీని సర్వశక్తులు ఒడ్డి గెలిస్తామని అన్నారు.