bear wanders in suryapet video : సూర్యాపేటలో ఎలుగుబంటి సంచారం.. వీడియో వైరల్ - bear wanders in suryapet video
🎬 Watch Now: Feature Video
bear wanders in suryapet video Viral : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎలుగుబంటి సంచరించడం కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని డీమార్ట్ వెనకాల నిర్మాణంలో ఉన్న ఇంటిలోకి ప్రవేశించి స్థానికుల కంటపడింది. మొదటగా తండు శ్రీనివాస్ అనే ఇంటిలోకి ప్రవేశించింది. ఎలుగుబంటిని గమనించిన స్థానికులు కేకలు వేశారు. దాంతో సమీపంలో ఉన్న గుండగాని రాములు ఇంటి బాత్ రూమ్‌లోకి చొరబడింది.
ఎలుగుబండి సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని సురక్షితంగా పట్టుకునేందుకు హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు గత పది నెలలుగా తిరుమలగిరి మండల కేంద్రంలోని మామిడి తోటలు, అర్వపల్లి, సోలిపేట గుట్టల నుంచి ఎలుగుబంటి వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. అడవులు తగ్గిపోతున్న క్రమంలో ఇలా జంతువులన్నీ నివాస ప్రాంతాలకు వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు అంటున్నారు.