టోల్‌ప్లాజా వద్ద ఆగిన విమానం, వీడియో వైరల్ - aeroplane at indalevai toll plaza
🎬 Watch Now: Feature Video
Aeroplane at toll plaza టోల్‌ప్లాజా వద్ద విమానం ఆగింది. మీరు విన్నది నిజమే, నిజమే అయితే టోల్‌ప్లాజా వద్ద విమానం ఆగడమేంటి అనుకుంటున్నారా. అయితే అది నిజమైన విమానం కాదులెండి. కొత్తగా తయారు చేసిన విమాన పైభాగాన్ని 44వ జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్‌కు లారీపై తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద కాసేపు ఆపారు. దీంతో స్థానికులు విమానాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వీడియోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్‌గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST