సూర్యాపేటలో 7 అడుగుల కొండచిలువ కలకలం - కొట్టి చంపిన స్థానికులు - Huge Python Found in Suryapet
🎬 Watch Now: Feature Video
Published : Dec 21, 2023, 1:06 PM IST
7 Feet Long in Python Suryapet : సాధారణంగా పాము అంటేనే అమ్మో అని పరుగులు తీస్తాం. అలాంటిది కొండ చిలువ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. దాని ఆకారం చూడగానే బెంబేలెత్తి పోతాం. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మాల్ చెరువు సమీపంలో ఓ భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. కొండ చిలువను రైతులు బలమైన రాడ్లతో కొట్టి చంపారు. ఈ కొండ చిలువ సుమారు 7 అడుగుల వరకు ఉంటుందని రైతులు తెలిపారు.
Huge Python In Suryapet District : నిత్యం చెరువు కట్ట మీద నుంచి రైతులు పొలాల దగ్గరకు వెళుతూ ఉంటారు. పొలాలకు వెళ్లే దారిలో కొండచిలువ కనిపించడంతో రైతులు భయభ్రాంతులకు గురయ్యారు. గతంలో కూడా ఒకటి, రెండు సార్లు కనిపించిందని స్థానిక కర్షకులు తెలిపారు. రాత్రి సమయంలో కనిపించడంతో రైతులు దానిని చంపామని వెల్లడించారు. కొండ చిలువను చంపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.