Saibaba Sansthan New Rule for VIP Pass to Shirdi Darshan: శిరిడీలో సాయిబాబా హారతి, దర్శనానికి వీఐపీ పాస్ కావాలంటే ఇప్పుడు సాయిబాబా సంస్థాన్ కొత్త రూల్ అమల్లోకి తెచ్చింది. సాయిబాబా దర్శనం పాస్ లేదా ఆర్తి పాస్ పొందేటప్పుడు భక్తులు తప్పనిసరిగా మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు కార్డును అందించాలని సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి. శివశంకర్ తెలియజేసారు.
సాయిబాబా దర్శనం కోసం శిరిడీకి వచ్చిన కొందరు భక్తులు సాయిబాబా దర్శనం చేసుకుని తిరిగి వెళ్లేందుకు తొందరపడుతున్నారు. ఇదే సమయంలో కొందరు ఏజెంట్లు వారిని మోసం చేసి దోచుకుంటున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై కొందరు భక్తులు సాయిబాబా సంస్థాన్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. కాబట్టి ఇప్పుడు భక్తులు స్వయంగా పాస్ పొందాలి. దీనితోపాటు, మొబైల్ నంబర్, ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది.. ఇంక సాయిబాబా హారతి, దర్శన పాస్ పొందడానికి వచ్చే భక్తులందరూ తమ ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
Saibaba Sansthan Online Portal: సాయిబాబా సంస్థాన్ www.sai.org.in ఆన్‌లైన్ పోర్టల్‌లో సాధారణ భక్తులు చెల్లింపు దర్శనం ఇంకా హారతి పాస్‌లను ముందుగానే బుక్ చేసుకోవచ్చని సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి. శివ శంకర్ తెలిపారు. సాయిబాబా దర్శనం కోసం వీఐపీ పాస్‌ను పొందేందుకు ఒకరి ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు అవసరం కాగా ఇతరుల పేరు తప్పనిసరి.
సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి. శివ శంకర్ ఆర్తి కోసం పాస్ తీసుకునేటప్పుడు సభ్యులందరికీ గుర్తింపు కార్డు తప్పనిసరి అని తెలియజేశారు. అలాగే, ఆన్‌లైన్ దర్శన్ పాస్ కోటాను 500 నుండి 1000కి పెంచినట్లు తెలిపారు. అంతేకాకుండా అధికారిక వెబ్‌సైట్ www.sai.org.inలో చెల్లింపు దర్శన్ పాస్, ఆర్తి పాస్‌లను అందుబాటులో ఉంచారు. సాయిబాబా దర్శనానికి సాధారణ భక్తులందరినీ పాస్ లేకుండా దర్శన క్యూ నుండి నేరుగా ఆలయంలోకి అనుమతిస్తామని శివశంకర్ చెప్పారు. వీఐపీ పాస్ విషయంలో సాయిబాబా సంస్థాన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని, వీఐపీ పాస్ ద్వారా భక్తుల దోపిడీని కొంతమేరకైనా తగ్గించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అన్నారు.