ETV Bharat / sukhibhava

బీజకోశ క్యాన్సర్ – త్వరిత నిర్ధరణే సగం చికిత్స - బీజకోశ క్యాన్సర్ రోగ నిర్ధరణ

ఛాతీ క్యాన్సర్ కాకుండా స్త్రీలలో ప్రత్యేకంగా కనిపించే మరొక క్యాన్సర్ బీజకోశాలకు (ఓవరీ) సంబంధించింది. గ్లోబోక్యాన్ (గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ) 2018 నివేదిక ప్రకారం బీజకోశ క్యాన్సర్ స్త్రీలలో కలిగే 8 సాధారణ జబ్బులలో ఒకటిగా ఉంది. దీని ప్రారంభ లక్షణాలు ఇతర సాధారణ జబ్బులతో పోలి ఉండటం వల్ల ముందుగా గుర్తించటం లేదు. అందువల్ల ఈ జబ్బును ముందే కనుగొనే మార్గాలు, సత్వర చికిత్స ఎలా పొందాలో తెలుసుకుందాం.

World Ovarian Cancer Day: Early Diagnosis For Better Treatment
బీజకోశ క్యాన్సర్ – త్వరిత నిర్ధారణే సగం చికిత్స..
author img

By

Published : May 8, 2021, 9:42 PM IST

క్యాన్సర్ వ్యాధి గురించి అందరికీ కొంత అవగాహన ఉంటుంది. ఇందులోని రకాలు, ఏయే శరీర భాగాల్లో ఇది కలుగుతుందో, వాటి వల్ల కలిగే అనారోగ్యం గురించి చాలా మందికి పరిజ్ఞానం అంతో ఇంతో ఉంటుంది. బీజకోశ క్యాన్సర్ గురించి అవగాహన పెంచటం కోసం ఏటా మే 8వ తేదీన వరల్డ్ ఒవేరియన్ క్యాన్సర్ డే ని జరుపుకుంటున్నాం.

బీజకోశ క్యాన్సర్ లక్షణాలు:

శరీరంలోని ఏ భాగంలోనైనా జీవ కణాలు అదుపులేకుండా పెరుగుతూ ఉంటే క్యాన్సర్ అంటాం. బీజకోశ క్యాన్సర్​లో స్త్రీలలో బీజాలను ఉత్పత్తి చేసే రెండు కోశాలలోనూ క్యాన్సర్ కలుగుతుంది. స్త్రీలకు అవసరమైన హార్మోన్లను, పునరుత్పత్తికి అవసరమయ్యే స్త్రీ బీజాలను బీజకోశాలు ఉత్పత్తి చేస్తుంటాయి. ఇవి రెండూ పొత్తి కడుపులో గర్భాశయానికి ఇరువైపులా ఉంటాయి.

బీజకోశ క్యాన్సర్ ప్రారంభ దశలో లక్షణాలు ఏమీ కనిపించకపోవచ్చు. కొన్ని లక్షణాలు కనిపించినా రుతు స్రావ సమస్యలుగా లేదా పెద్ద పేగుకు సంబంధించిన విరేచన సమస్యగా అనిపించవచ్చు. అయితే ప్రత్యేకంగా ఈ లక్షణాలు ఉన్నాయేమో గమనించండి.

  • యోని ద్వారా రక్త స్రావం, ముట్లుడిగిన తరువాత కూడా కలుగవచ్చు.
  • పొత్తి కడుపులో నొప్పి, ఒత్తిడి
  • నడుము నొప్పి, కడుపు నొప్పి.
  • కడుపు ఉబ్బరం
  • కొద్దిగా తిన్నా కడుపు నిండినట్లుండటం
  • మలబద్ధకం, తరచూ మూత్ర విసర్జన ఒత్తిడి.

మీ శరీరంలో ఇటువంటి మార్పులను గమనించి, ముఖ్యంగా యోని ద్వారా రక్తస్రావం ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించండి. ఇటువంటి లక్షణాలు రెండు వారాలకు పైబడి ఉన్నా వైద్య సలహా తీసుకోవాలి.

బీజకోశ క్యాన్సర్​తో ఆరోగ్య సమస్యలు:

దీనికి కచ్చితమైన కారణాలు తెలియకపోయినా ఇక్కడ సూచించిన కొన్ని పరిస్థితులు ఈ ప్రమాదాన్ని పెంచవచ్చు.

  • కుటుంబంలో ఈ వ్యాధి చరిత్ర
  • వయస్సు
  • బి.ఆర్.సి.ఏ 1 లేదా బి.ఆర్.సి.ఏ 2 జన్యు పరీక్షలో పాజిటివ్​గా ఉండటం
  • ఛాతీ, గర్భాశయ, పెద్ద పేగు క్యాన్సర్ ఉండటం
  • ఊబకాయం
  • సంతానం లేకపోవటం
  • ఎండోమెట్రియోసిస్
  • జీవన శైలి

రోగ నిర్ధరణ, చికిత్స:

ఈ లక్షణాలు కనిపించగానే వైద్యులు పొత్తి కడుపు పరీక్ష చేస్తారు. అల్ట్రా సౌండ్, సి.టి.స్కాన్, ఎమ్.ఆర్.ఐ స్కాన్, రక్త పరీక్ష, బయాప్సీ, కొలనోస్కోపీ, లాప్రోస్కోపీ మొదలైన పరీక్షలు నిర్వహిస్తారు. బీజకోశ క్యాన్సర్ నిర్ధరణ తరువాత కీమో థెరపీ అనగా ఔషధాలతో చికిత్సించటం, శస్త్ర చికిత్స కలిపి చేయవచ్చు. హార్మోన్లతో చికిత్స, రేడియేషన్​తోనూ లేదా ఇమ్యునోథెరపీ వాడి చికిత్స చేయవచ్చు. ఈ చికిత్సా విధానం రోగి వయసు, క్యాన్సర్ దశ, ఆరోగ్య స్థితి మొదలైన అంశాలు పరిగణనలోకి తీసుకొని నిర్ణయిస్తారు.

ఎంత త్వరగా వ్యాధి నిర్ధరణ అయితే అంత సత్ఫలితాలనందించే చికిత్సను ఇవ్వవచ్చు. పైన సూచించిన లక్షణాలలో, ముఖ్యంగా రక్తస్రావం, రెండు వారాలకు మించి ఉన్నట్లయితే వైద్యున్ని సంప్రదించండి. ఇవి క్యాన్సర్ లక్షణాలు కాకపోవచ్చు. అయినా సందేహం నివృత్తి చేసుకోవటం చాలా అవసరం. ఈ కొవిడ్ రోజుల్లో వైద్యులు రోగులను ప్రత్యక్షంగా చూడలేకపోవచ్చు. అంతర్జాలం ద్వారా వైద్యున్ని సంప్రదించి సరైన చికిత్సను సత్వరంగా పొందవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.