ETV Bharat / sukhibhava

healthy lifestyle: పోషకాహారంతోనే విజయం! - పిల్లల్లో ఏకాగ్రతను పెంచడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి

శరీరంలో అత్యంత శక్తిమంతమైనది మెదడు. ఇది సరిగా పనిచేస్తేనే మిగతా జీవక్రియలు క్రమం తప్పకుండా జరుగుతాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న మెదడు సరైన రీతిలో పనిచేయాలంటే చిన్ననాటి నుంచే పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే చిన్నపిల్లల్లో మెదడు చురుగ్గా (Memory Tips For Students) ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏం చేయాలి అనేది తెలుసుకుందాం.

Memory Tips For Students
పిల్లల్లో జ్ఞాపకశక్తి
author img

By

Published : Sep 29, 2021, 7:00 AM IST

శరీరంలో అతి ముఖ్యమైన అవయవం మెదడు. ఇది ఆరోగ్యంగా ఉంటేనే మిగతా జీవక్రియలన్నీ సవ్యంగా జరుగుతాయి. మరి ఆ మెదడు (Memory Tips For Students) ఆరోగ్యంగా ఉండాలంటే బాల్యం నుంచి అందే పోషకాహారమే కీలకం అంటున్నారు వైద్యులు.

చిన్నప్పటి నుంచి..

స్కూల్‌ స్థాయికి చేరుకోకముందు నుంచే పిల్లలకు సరైన పోషకాలు అందాలి. లేదంటే వారి జీవన నైపుణ్యాలు కుంటుపడే ప్రమాదం ఉంది. ఏకాగ్రతా కొరవడుతుంది. చదువులోనూ ముందడుగు వేయలేరు. అందుకే చేప, బ్రకోలీ, బెర్రీలు వంటివి వారి ఆహారంలో చేర్చాలి. వీటివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అధిక చక్కెర, చెడు కొలెస్ట్రాల్‌కు పిల్లలను దూరంగా ఉంచాలి. లేదంటే అధికబరువుకు కారణమై, పలురకాల అనారోగ్యాలకు గురిచేస్తాయి. దేనిపైనా ఏకాగ్రత వహించలేరు.

మానసికంగా..

చక్కటి పోషకాహారం అందిన చిన్నారులు మానసికంగానూ ఉత్సాహంగా ఉంటారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఉత్సాహంగా ఉండే పిల్లలు క్రీడలపై ఆసక్తిని పెంచుకుంటారు. ఇది వారిని శారీరకంగా దృఢంగా ఉంచుతుంది. వారి మెదడు కూడా ప్రభావితమై హుషారుగా, శక్తి మంతులుగా ఉంటారు. చదువులోనూ ముందుండి, సరైన లక్ష్యాలను ఏర్పరుచుకుని సాధించడానికి కృషి చేస్తారు. పోషకాహార లోపమున్న పిల్లల్లో ఆ ఉత్సాహం ఉండదు. మానసికంగా పలు రుగ్మతలకు గురవుతూ ఉంటారు. దీంతో వారి భవిష్యత్తు ఒడుదొడుకులకు గురయ్యే ప్రమాదం ఉంది.

వీటిని అందించాలి..

చిన్నప్పటి నుంచి ఎముకలు బలంగా పెరగడానికి క్యాల్షియం అత్యంత ముఖ్యమైంది. పాలు, పెరుగు, విత్తనాలు వంటివి ఆహారంలో ఉండేలా చేస్తే మంచిది. కండరాలు ఆరోగ్యంగా ఉండటానికి ప్రొటీన్లుండే గుడ్లు, మాంసా హారం, వెన్న వంటివి అందించాలి. రక్త హీనతకు గురికాకుండా కార్బొహైడ్రేట్లుండే ఆహారాన్ని అందిస్తే శక్తిమంతులవుతారు. దీనికోసం బంగాళాదుంపలు, యాపిల్స్‌, తృణధాన్యాలతో చేసే బ్రెడ్‌ వంటివి రోజూ ఆహారంలో ఉండాలి. ఐరన్‌ తగినంత అందడానికి తాజా ఆకు, కాయగూరలు తప్పని సరి. వారి శరీరం విటమిన్లను గ్రహించేలా ఆరోగ్యకర కొవ్వు ఉండే చేప, అవకాడో, గింజ ధాన్యాలు వంటివీ తినిపించాలి.

అలవాట్లు..

ఆరోగ్యకర అలవాట్లను అలవరచాలి. బాల్యం నుంచి రసాయనరహిత ఆహారంపై ఆసక్తి కలిగేలా చేయాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌కు దూరంగా ఉంచాలి. శీతలపానీయాలకు బదులుగా తాజాపండ్ల రసాలను తీసుకునేలా ప్రోత్సహించాలి. లేదంటే ఎటువంటి అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందో అవగాహన కలిగించాలి. అల్పాహారం నుంచి రాత్రి డిన్నర్‌ వరకు దేన్నీ స్కిప్‌ చేయకుండా ఉంటేనే ఆరోగ్యంగా ఉండొచ్చనే విషయాన్ని వారికి చెప్పాలి. ఇటువంటి అలవాట్లన్నీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి.

ఇదీ చూడండి: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.