మానవ శరీరానికి క్యాప్సికం చేసే మేలు అంతా ఇంతా కాదు. శరీరానికి కావలసిన విటమిన్ సి, పీచు, యాంటీఆక్సిడెంట్లు.. తదితర పోషకాలు, ఇతర ఖనిజాలు అధికంగా లభిస్తాయి.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా..
క్యాప్సికంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సి ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో అవయవాలు, రక్తనాళాలు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. అలాగే క్యాప్సికంను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగనిరోధకశక్తిని కూడా పెంచుకోవచ్చు. సి-విటమిన్‌కు మనం తినే ఆహారపదార్థాల్లోని ఐరన్‌ను ఎక్కువగా గ్రహించే శక్తి ఉంటుంది. మన శరీరంలో సి-విటమిన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ మొత్తంలో ఐరన్ ఉంటుంది. అందువల్ల ఐరన్ లేమితో బాధపడే వారికి క్యాప్సికం మంచి ఆహారమనే చెప్పాలి.
క్యాలరీలు తక్కువ..
క్యాప్సికంలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది తింటే బరువు పెరుగుతామనే భయం ఉండదు. శరీరంలోని కొవ్వును కరిగించి జీవక్రియల్ని వేగవంతం చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీన్ని సలాడ్ల రూపంలో, కూరల్లో వేసుకుని తినడం ఆరోగ్యానికి మంచిది.
గుండెకు రక్షణగా..
గుండె ఆరోగ్యాన్ని పెంచడంలోనూ క్యాప్సికం కీలక పాత్ర పోషిస్తుంది. కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తనాళాల్లో, ధమనుల్లో బ్లాకేజ్‌లు ఏర్పడకుండా గుండెకు రక్షణనిస్తుంది. గుండెను సురక్షితంగా ఉంచుకునేందుకు ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం చాల మంచిది.
ప్రతిరోజూ తింటే బోర్ కొడుతుంది కదా! అంటారా? అయితే ఇతర కూరగాయల్లో దీన్ని వేసుకుని తినేయడమే... క్యాప్సికంలో ఉండే క్యాప్సాయిసిన్స్ అనే సమ్మేళనం శరీరంలో కార్సినోజెన్ అభివృద్ధిని నిరోధిస్తుంది. ఫలితంగా క్యాన్సర్ రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు.

అదుపులో మధుమేహం..
మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారికి రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉండవు. ఇది చాలా ప్రమాదకరం..క్యాప్సికం రక్తంలోని చక్కెర స్థాయుల్ని, మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో క్యాలరీలు, కొవ్వులు చాలా తక్కువ మొత్తంలో ఉండడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగకుండ జగ్రత్త పడోచ్చు.
ఆందోళనను తగ్గిస్తుంది..
కొంతమంది చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతూ..మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఇలాంటి వారు క్యాప్సికం తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ బి6, మెగ్నీషియం ఆందోళనను, ఉద్రేకాన్ని తగ్గించి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి.

జీర్ణవ్యవస్థ పటిష్టం..
ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్ట్రిక్ సమస్య.. జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలకు క్యాప్సికంను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఏ సమస్యనైనా నయం చేసే శక్తి క్యాప్సికంకు ఉంది.
కంటికి మంచిది..
క్యాప్సికంలో ఉండే విటమిన్ ఎ వల్ల కంటి సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. చర్మంపై ఏర్పడే దద్దుర్లు, మొటిమలు వంటివి తొలగించడంలో ఇది ఉపయోగపడుతుంది.
కండరాలు దృఢంగా..
పొటాషియం అధికంగా లభించే ఆహార పదార్థాల్లో క్యాప్సికం ఒకటి...శరీరంలో ఖనిజాల స్థాయుల్ని బ్యాలన్స్ చేయడంలో పొటాషియం సహకరిస్తుంది. దీనివల్ల బీపీ అదుపులో ఉండడంతో పాటు కండరాల పనితీరు మెరుగుపడుతుంది.
ఇదీ చదవండి: కొత్త కొత్తగా 'కొత్తు పరోటా'.. టేస్ట్ చేయాల్సిందే!