కరోనా నుంచి కోలుకున్న వారిని మరో కొత్త సమస్య వెంటాడుతోంది. గుజరాత్ సూరత్‌లో వైరస్ బారినపడి కోలుకున్న యువతలో తీవ్ర దుష్ప్రభావాలు కనిపించడం షాకింగ్‌గా ఉందని వైద్యులు చెబుతున్నారు. నగరంలోని కరోనా బాధితుల్లో 50నుంచి 60 శాతం మందిలో డీ-డైమర్ ఓ మోస్తరుగా ఉన్నట్లు గుర్తించామని ప్రముఖ హృద్రోగ వైద్యులు డా.అతుల్ అభ్యంకర్ ఈటీవీ భారత్‌కు తెలిపారు. అయితే 10 నుంచి 15శాతం బాధితుల్లో డీ-డైమర్ అధిక స్థాయిలో ఉండటం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. దీనికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే మరణానికి దారితీస్తుందని వివరించారు. కరోనా దుష్ప్రభావాల కారణంగా ఎంతో మంది చనిపోతున్నారని, యువతలో డీ-డైమర్ సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. గుండె సమస్యలు ఉన్నవారే అధికంగా ప్రభావితమవుతున్నట్లు పేర్కొన్నారు.
డీ-డైమర్ టెస్టు గురించి డా.అతుల్ అభ్యంకర్ ఏం చెప్పారో చూద్దాం..