మెంతులు
మజ్జిగలో కాసిన్ని మెంతులు వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది.
పెరుగు:
దీనిలో ఉండే బ్యాక్టీరియా పొట్ట సమస్యలను తగ్గించడానికి సాయపడుతుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది.
వాము:
ఇది నీళ్ల విరేచనాలను తగ్గించడానికి ఎంతగానో సాయపడుతుంది. అంతేకాదు కలుషితమైన నీరు తాగడం వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్‌నూ నియంత్రిస్తుంది. వేడినీళ్లలో కాస్త వాము వేసుకుని తాగితే కడుపు నొప్పి కూడా తగ్గుతుంది.
మంచినీళ్లు:
కాచి చల్లార్చిన నీళ్లను మాత్రమే తాగాలి. ఆ నీటిలో కాస్త పంచదార, చిటికెడు ఉప్పు వేసి తరచుగా తీసుకుంటే శరీరానికి శక్తి అంది నీరసం తగ్గుతుంది.
అన్నం:
అన్నంలో పెరుగు, కొంచె పంచదార, కాస్త నిమ్మరసం వేసుకుని తినడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది.
అటుకులు:
వీటిని ఉడికించి కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, చిటికెడు పంచదార కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది.