ETV Bharat / sukhibhava

ఈ ఏడు నిమిషాల 'హిట్' వర్కౌట్స్​తో మీరు సూపర్​ ఫిట్​!

author img

By

Published : Jul 23, 2022, 7:28 AM IST

Updated : Jul 23, 2022, 11:52 AM IST

బాడీని ఫిట్​గా ఉంచుకునే ప్రయత్నంలో భాగంగా హిట్​ను (హెవీ ఇంటెన్సిటీ ట్రైనింగ్​) ఫాలో అవుతున్నారు చాలా మంది. ముఖ్యంగా యువత ఈ తరహా కసరత్తులకు మొగ్గు చూపుతోంది. అయితే వీటిని సరిగ్గా చేయకపోతే సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఆ వ్యాయామాలు ఏంటో.. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం.

ఈ ఏడు నిమిషాల వర్కౌట్స్​తో మీరు సూపర్​ ఫిట్​!

హిట్​ వర్కౌట్​ తెలుసా?

ఫిట్​గా ఉండటానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. అందుకే ఈ మధ్య హెవీ ఇంటెన్సిటీ ట్రైనింగ్(హిట్​)​ పేరుతో ట్రెండ్​ను ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే అతితక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో కేలరీలు తగ్గే కఠిన వ్యాయామాలు చేస్తుంటారు. 7 మినిట్​ వర్కౌట్ పేరుతో చేసే ఈ వ్యాయామాలు శరీరాన్ని ఆరోగ్యకరంగా తయారు చేయడం నిజమే అయినా వీటిని జాగ్రత్తగా చేయాలంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ వ్యాయామాలు ఏంటి? వాటిని వల్ల లాభాలేంటి మొదలైన విషయాలు తెలుసుకుందాం.

గంటల పాటు సమయం వెచ్చించాలని భావించి ఆ ఆలోచనను పక్కన పెట్టేస్తారు. కానీ ఫిట్​గా తయారుకావాలంటే గంట కాదు కేవలం ఏడు నిమిషాలు చాలు. అవును.. రోజుకు ఏడు నిమిషాల పాటు ఈ వ్యాయామాలు చేస్తే మీరు సూపర్​ ఫిట్ అయిపోతారు. ఇంతకీ అవేంటి?

  • జంపింగ్​ జాక్స్​ - ఈ వ్యాయామం వల్ల మోకాళ్లు, కడుపు, పిరుదులు, చేతుల కండరాలు దృఢంగా మారుతాయి. రోజుకు సెట్​కు 30 సెకన్లు చొప్పున మూడు సెట్లు చేయాలి.
  • పుషప్స్​ - ఈ వర్కౌట్​తో ఛాతి కండరాలు, ట్రైసెప్స్​ (చేతి వెనుక భాగం) దృఢంగా ఉంటాయి. వాటిని సెట్​కు 30 చొప్పున ఐదు సెట్లు చేయాలి.
  • ప్లాంక్ - ఈ వ్యాయామాన్ని కూడా సెట్​కు 30 సెకన్ల చొప్పున ఐదు సెట్లు చేయాలి. ఈ ప్లాంక్​ పొజీషన్​లో ఉన్నప్పుడు భుజం, పిరుదుల వద్ద కండరాలు బలపడటం సహా పొట్ట తగ్గుతుంది.
  • లాంజెస్ - ఈ ఎక్స్​ర్​సైజ్​ను రోజుకు ఐదుసెట్లు చేయాలి. ఇందులో భాగంగా సెట్​లో కనీసం 30 సెకన్లు ఆ పొజీషన్​లో ఉండాలి. అయితే ఇవి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ వ్యాయామంతో తొడ, పిక్కలు, వీపు దగ్గరి కండరాలు దృఢంగా మారుతాయి.

ఇదీ చూడండి : మీ పిల్లల్ని తరచూ తలనొప్పి వేధిస్తుందా.. చెక్​ పెట్టేయండిలా..

Last Updated : Jul 23, 2022, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.