Food for Lung Problems: కరోనా జనజీవితాన్ని అల్లకల్లోలం చేసింది. దీన్ని తట్టుకుని నిలబడాలంటే రోగనిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. మరి ఊపిరితిత్తులకు సత్తువనిచ్చే ఆహారం ఏంటో చూద్దాం.
పసుపు: శ్వాసనాళాల్లో ఏర్పడే కఫాన్ని తగ్గించి.. శ్వాస సంబంధ ఇబ్బందులను పరిష్కరిస్తుంది.
అల్లం: ఊపిరితిత్తుల్లో ఉండే కల్మషాన్ని తగ్గిస్తుంది. తద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తొలగి ఊపిరి పీల్చుకోవడం తేలికవుతుంది.
ఆపిల్: విటమిన్ సీ, విటమిన్ ఇ, విటమిన్ బీ, బీటా కెరోటిన్లు ఆపిల్లో అధికంగా ఉంటాయి. ఊపిరితిత్తులను శక్తిమంతంగా తయారు చేసి, సక్రమంగా పని చేయడంలో సహాయపడుతుంది.
నిమ్మజాతి పండ్లు: నిమ్మ, కమల, బత్తాయి వంటి నిమ్మజాతి పండ్లలో ఉండే విటమిన్ సీ.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
వాల్నట్(అక్రోట్): వాల్నట్లలో పుష్కలంగా ఉండే ఒమేగాత్రీ ఆమ్లాలు.. ఊపిరితిత్తుల్లో మంటను తగ్గిస్తాయి. శ్వాసలోని ఇబ్బందిని తొలగిస్తాయి.
బెర్రీస్: రేగిపండ్లు, ద్రాక్ష పండ్లు, స్ట్రాబెర్రీస్, చెర్రీస్ వంటి పండ్లలో ఉండే విటమిన్ సీ.. ఊపిరితిత్తుల్లో కణజాలానికి హాని కలిగించే నలుసులతో పోరాడుతాయి.
మిరియాలు: కారంగా, ఘాటుగా ఉండే మిరియాల్లో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. ఊపిరితిత్తులకు సంక్రమించే వ్యాధులను తగ్గించి, వాటి పనితీరును మెరుగుపరుస్తుంది. పొగతాగేవారి ఊపిరితిత్తులకు మిరియాలు బాగా ఉపయోగపడతాయి.
ఇదీ చూడండి: ఈ ఆయుర్వేద చిట్కాలతో నడుం నొప్పి మాయం!