ETV Bharat / sukhibhava

ఈ లక్షణాలు మీ బాడీలో కనిపిస్తున్నాయా?- అయితే మీకు టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లే! జాగ్రత్త సుమా!! - డయాబెటిస్​ను ఏ విధంగా గుర్తించాలి

Symptoms Of Type 2 Diabetes : ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య టైప్​-2 డయాబెటిస్. అయితే దీనిని ఆదిలోనే గుర్తించి ట్రీట్​మెంట్ తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం. అయితే ఈ లక్షణాలతో టైప్ 2 డయాబెటిస్​ను ఈజీగా గుర్తించవచ్చంటున్నారు నిపుణులు. టైప్-2 డయాబెటిస్ రావడానికి కారణాలు, నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. టైప్-2 డయాబెటిస్ రావడానికి కారణాలు, నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం.

Symptoms Of Type 2 Diabetes
Symptoms Of Type 2 Diabetes
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 2:22 PM IST

Symptoms Of Type 2 Diabetes : మధుమేహం వ్యాధి ఇటీవల కాలంలో ఎక్కువ మందికి వస్తోంది. జీవన అలవాట్ల వల్ల చాలా మంది టైప్-2 డయాబెటిస్ బాధితులుగా మారుతున్నారు. టైప్-2 డయాబెటిస్​ను ఎలా గుర్తించాలి? ఈ వ్యాధి రావడానికి కారణాలు ఏమిటి? నివారణకు మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టైప్ 2 డయాబెటిస్
సాధారణంగా మధుమేహం వ్యాధిని చాలా మంది ముందుగా గుర్తించలేరు. ఒక్కోసారి మనకు తెలియకుండానే పదేళ్ల వరకు మధుమేహానికి మందులు వాడకుండా చాలా మంది గడిపేస్తుంటారు. సుదీర్ఘ కాలం చికిత్స తీసుకోకపోవడం వల్ల శరీరంలో ఇతర అవయవాలు దెబ్బతింటాయి. వ్యాధి బాగా ముదిరిపోవడం వల్ల ఇలా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్నందున డయాబెటిస్​ను ముందుగా గుర్తించడమే శ్రేయస్కరం. దీనికి కారణం టైప్-2 డయాబెటిస్ లక్షణాలు చాలా ఆలస్యంగా బయటపడతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు అంటున్నారు.

Diabetes Patient Precautions : కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. మధుమేహాన్ని గుర్తించడానికి చిన్న రక్త పరీక్ష చేస్తే సరిపోతుందని 40 ఏళ్లు దాటినవారు తగినంత శారీరక శ్రమ చేయని వారు, ఊబకాయం ఉన్నవారు డయాబెటిస్ టెస్టులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేయించుకోవడం మంచిదని అంటున్నారు వైద్యులు.

ముఖ్యంగా మధుమేహం వ్యాధిని ముందుగా గుర్తించకపోతే శరీరంలో ఇతర అవయవాలపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు పీవీ రావు. కిడ్నీ, లివర్, కళ్లు, గుండె వంటి ముఖ్యమైన శరీర భాగాలపై డయాబెటిస్ ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ముందుగానే అప్రమత్తమై ఆహారంలో, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే డయాబెటిస్ తీవ్రత ఎక్కువగా లేకుండా జాగ్రత్త పడొచ్చని, సాధారణ జీవితం గడపొచ్చని వైద్య నిపుణులు పీవీ రావు అంటున్నారు.

డయాబెటిస్ వ్యాధి రెండు రకాలు
మధుమేహం వ్యాధి రెండు రకాలుగా చెబుతుంటారు. వాటిలో మొదటిది టైప్-1 డయాబెటిస్, రెండోది టైప్-2 డయాబెటిస్. మొదటిదైన టైప్-1 డయాబెటిస్ కుటుంబ వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. కుటుంబ వంశ చరిత్ర, ముందుతరాల వారికి మధుమేహం ఉంటే ఆ కుటుంబంలో వారసులకు టైప్ 1 డయాబెటిస్ ఆటోమెటిక్​గా వస్తుందంటున్నారు నిపుణులు.

ఇక టైప్-2 డయాబెటిస్ విషయానికొస్తే క్రమశిక్షణ లేని జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అధిక బరువు కారణంగా టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ఒక్కోసారి టైప్-2 డయాబెటిస్​ను మందులతో నియంత్రించినా తీవ్రత పెరిగితే ప్రతి రోజూ ఇన్సులిన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి దుస్థితి తలెత్తకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

టైప్-2 డయాబెటిస్ లక్షణాలు
రక్తంలో చక్కెర శాతం మోతాదుకు మించి ఉంటే డయాబెటిస్ వచ్చినట్లు నిర్ధరిస్తారు. మధుమేహం వల్ల ఎక్కువ సార్లు మూత్రం వస్తుంది. ఎక్కువగా దాహం వేయడం, కంటి చూపు తగ్గిపోవడం, శరీర బరువు తగ్గడం, పాదాలలో మంటలు వంటి లక్షణాలు ఉంటాయి. డయాబెటిస్ ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే ఆ ప్రభావం శరీరంలో ఇతర అవయవాలపై పడుతుంది. దీనివల్లే కంటి చూపు తగ్గిపోతుంది. మూత్ర పిండాలు దెబ్బతింటాయి. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రాణాంతకమైన జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

డయాబెటిస్ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
టైప్-2 డయాబెటిస్ బాధితులు బరువు తగ్గడం చాలా ముఖ్యం. బరువు తగ్గడం ద్వారా డయాబెటిస్​ను నియంత్రించవచ్చు. సరైన సమయానికి నిద్ర పోవడం, నిద్ర లేవడం, మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వల్ల ఈ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే టైప్-2 డయాబెటిస్​ను చాలా వరకు నియంత్రించవచ్చు.

వ్యాయామంతో మేలు
వ్యాయామం చేయడం వల్ల కండరాలు గట్టిపడతాయి. తద్వారా కణాలకు ఇన్సులిన్ గ్రహించే శక్తి పెరుగుతుంది. ఎండార్ఫిన్, సెరొటోనిన్ల ఉత్పత్తి పెరగడం వల్ల ఉల్లాసం కలుగుతుంది. ఫలితంగా డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.

వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రతిఒక్కరూ మధుమేహం రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. మన శరీర బరువును నియంత్రించుకోవాలి. తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. అంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ప్రతిరోజు కనీసం అరగంట పాటు నడక, ఇతర వ్యాయామాలు చేయాలి. టెన్షన్, పని ఒత్తిడి లేకుండా చూపుకోవాలి. ఆకుకూరలు, తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగంగా తీసుకోవాలి. జంక్ ఫుడ్​కు దూరంగా ఉండాలి. తగిన మోతాదులోనే ఆహారం తీసుకోవడం ఉత్తమం.

ఆరోగ్యకరమైన అలవాట్లే కీలకం
మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలితో మధుమేహం రాకుండా జాగ్రత్త పడొచ్చు. వ్యాధి సంక్రమించిన తర్వాత కూడా సరైన జాగ్రత్తలు పాటిస్తే ఇతర దుష్ప్రరిణామాలను రాకుండా చూసుకోవచ్చు. వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి ఉందో? లేదో? నిర్ధారించుకోవాలి. వ్యాధి తీవ్రతను బట్టి మందులు వాడాల్సిన అవసరం ఉందో లేదో వైద్యులు చెబుతారు. కొన్నిసార్లు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా వ్యాధిని అదుపులో పెట్టొచ్చని భావిస్తే వైద్యులు ఆ విధమైన సూచనలు సలహాలిస్తారు. ఈ విధంగా టైప్-2 డయాబెటిస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

ఈ లక్షణాలు మీ బాడీలో కనిపిస్తున్నాయా?- అయితే మీకు టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లే!

ఈ లక్షణాలు మీ బాడీలో కనిపిస్తున్నాయా? - అయితే మీకు టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లే!

భోజనంలో ఈ మార్పులు చేయండి.. షుగర్‌ మీరు చెప్పినట్టు వినాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.