ETV Bharat / sukhibhava

వీర్యం కోల్పోతే బలహీనమవుతారా? అపోహ‌లు, వాస్త‌వాలు! - వీర్యం కోల్పోతే బలహీనమవుతారా

Sperm Loss Myths in Telugu : శృంగారంపై చాలా మందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. అందులో వీర్యం గురించి కూడా విషయాలు కూడా ఉంటాయి. వీర్యం కోల్పోతే బలహీనంగా మారతామనేది అనేక మంది అకుంటారు. మరి ఇందులో నిజమెంత ? వివరాలు తెలుసుకుందాం.

semen myths and realities
Does Weakness Occur While Losing Semen
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 7:31 AM IST

Sperm Loss Myths in Telugu : ఒక్క వీర్యం బొట్టు.. వంద ర‌క్త‌పు బొట్ల‌తో స‌మానం, మ‌నం తినే వాటిల్లో అతి సార‌వంత‌మైన ప‌దార్థం వీర్యంగా మారుతుంద‌ని, కండ‌రాల్ని పిండితే అందులో నుంచి వ‌చ్చే ర‌స‌మని, అది ఉంటే బ‌లంగా ఉంటారని, కోల్పోతే బ‌ల‌హీనంగా మార‌తార‌ని ఇలా చాలా ర‌కాల విష‌యాలు ప్ర‌చారంలో ఉన్నాయి. అనేక మందికి వీర్యం గురించి స‌రైన అవ‌గాహ‌న లేదు. పైన చెప్పిన వాటిల్లో నిజ‌మెంత‌, ఇత‌ర అపోహ‌లేమైనా ఉన్నాయా ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వీర్యంలో రెండు ర‌కాలుంటాయి. ఒక‌టి వీర్య‌క‌ణాలు, రెండోది ద్ర‌వం. వీటిల్లో వీర్య క‌ణాలు వృష‌ణాల నుంచి త‌యార‌వుతాయి. ట్యూబులార్ గ్లాండ్స్ లో ద్ర‌వం త‌యార‌వుతుంది. ముందుగా వృష‌ణాల నుంచి ఉత్ప‌త్త‌యిన శుక్ర‌క‌ణాలు ఆ గ్రంథుల్లో చేర‌తాయి. ఈ ఉత్ప‌త్తి ప్ర‌క్రియ నిరంత‌రం జ‌రిగి వీర్య‌క‌ణాలు శుక్ర‌కోశాల్లో చేర‌తాయి. కొద్ది రోజుల పాటు అవి అక్క‌డే ఉంటాయి. సెక్స్ అనంత‌రం లేదా ఇత‌ర మార్గాల్లో వీర్యం పోయిన‌ప్పుడు మ‌ళ్లీ కొత్త క‌ణాలు ఉత్ప‌త్తి అవుతాయి.

"శుక్ర‌కోశాల కిందే ప్రోస్టేట్ గ్రంథి ఉంటుంది. వీర్యం బ‌య‌టికి వ‌చ్చే స‌మ‌యంలో ఆ గ్రంథి నిమ్మ‌కాయ‌ను పిసికిన‌ట్లుగా అవుతుంది. దీంతో అది మూత్రంలోకి వ‌చ్చి బ‌య‌టికి వెళుతుంది. ఆ స‌మ‌యంలో 2 1/2 నుంచి 5 సీసీఎల్ ప‌రిమాణం గ‌ల ద్ర‌వం బ‌య‌టికి పోతుంది. వీర్యం అనేది నిరంత‌రం ఉత్ప‌త్త‌య్యే ప‌దార్థం కాబ‌ట్టి.. దాన్ని ఎంత కోల్పోయినా బ‌ల‌హీనంగా మార‌రు. ఒక బొట్టు వీర్యం వంద రక్తపు చుక్కలకు సమానం అని అంటుంటారు. అది నిజం కాదు."
- డాక్టర్​ సమరం, ప్రముఖ వైద్యులు

రెండో సారి సెక్స్ చెయ్యడానికి ఎంత స‌మ‌యం ప‌డుతుంది?
సెక్స్ విష‌యంలో స్త్రీ, ప‌రుషులిద్ద‌రికీ చాలా తేడాలుంటాయి. వారి శ‌రీర నిర్మాణం, కోరిక‌లు, సామ‌ర్థ్యం విష‌యంలో భిన్నంగా ఉంటారు. పురుషుల‌కు తొంద‌ర‌గా మూడ్ వ‌స్తే... మ‌హిళల‌కు ఆల‌స్య‌మవుతుంది. అయితే.. చాలా మందిలో ఒక‌సారి సెక్స్ లో పాల్గొన్న త‌ర్వాత.. తిరిగి రెండో సారి శృంగారం చేయాల‌నుకుంటే ఎంత స‌మ‌యం ప‌డుతుంది అనే సందేహం ఉంటుంది.

సాధార‌ణంగా పురుషుల్లో సెక్స్ లో పాల్గొన్న అనంత‌రం ఒక్క‌సారి వీర్యం ప‌డిపోయాక రెండో సారి తిరిగి రెండో సారి శృంగారం చేయాల‌నుకుంటే వెంట‌నే అంగం గ‌ట్టిప‌డ‌దు. దీనికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఈ మ‌ధ్య కాలాన్ని రిఫ్రాక్ట‌రీ పిరియ‌డ్ అంటారు. ఈ పిరియ‌డ్ అంద‌రిలో ఒకే ఉండ‌ద‌ని వైద్యులు చెబుతున్నారు. రిఫ్రాక్ట‌రీ పిరియ‌డ్ మ‌నుషుల్ని బ‌ట్టి మారుతుంది. అంగం రెండో సారి గ‌ట్టి ప‌డ‌టానికి కొంత మందికి 3 నుంచి 5 నిమిషాలు, మ‌రికొంత మందికి 15 నిమిషాలు ప‌డుతుంది. అంగం తిరిగి గ‌ట్టిప‌డ‌టానికి కొంద‌రికి 3 గంట‌లు, ఇంకొంత మందికి రోజంతా కూడా స‌మ‌యం ప‌డుతుంది. కానీ మెజారిటీ మందికి మాత్రం.. అర‌గంట అవుతుంది. త‌ర్వాతే రెండో సారి శృంగారంలో పాల్గొన‌గ‌ల‌రు.

వీర్యం కోల్పోతే బలహీనమవుతారా? అపోహ‌లు, వాస్త‌వాలు!

గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా? - ఈ యోగాసనాలతో రిలీఫ్​ పొందండి!

ఈ సింపుల్​ టిప్స్​ పాటిస్తే చెడు కొలెస్ట్రాల్​ దూరం! ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.