ETV Bharat / sukhibhava

Yoga Day 2021: ఈ ఆసనాలతో అన్ని లాభాలా? - latest news in telugu

యోగా.. భౌతిక, మానసిక అంశాలతో కూడిన అభ్యాసం. దీన్ని ప్రతిరోజూ పాటిస్తే శారీరక, మానసిక సమన్వయాన్ని పక్కాగా పాటించగలం. అయితే ఉదయాన్నే యోగాసనాలు అంటే బద్ధకించే కొందరికి ఇష్టమైనది 'శవాసనం'. హాయిగా పడుకొని రిలాక్స్​ అవ్వొచ్చని వారి భావన. అయితే ఇదే తరహాలో ఉండే రెస్టొరేటివ్​ యోగాకు బాగా డిమాండ్​ పెరుగుతోంది. మానసిక ఒత్తిడికి తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతోందని నిపుణులు చెప్తున్నారు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం(జూన్​ 21) సందర్భంగా దానిపై ఓ లుక్కేద్దాం.

Restorative yoga
రెస్టోరేటివ్​ యోగా
author img

By

Published : Jun 21, 2021, 10:30 AM IST

యోగా అంటే కేవలం బరువు తగ్గడానికో, కొవ్వు కరిగించుకోవడానికో చేసే ఆసనాలే కాదు. దానితో చాలా లాభాలు ఉన్నాయి. మనిషి శారీరక దృఢత్వాన్నీ, ఏకాగ్రతను పెంచుకోవడానికి ఇది సాయపడుతుంది. అందుకే దీన్ని అనుసరించేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు నుంచి ఉపశమనం, శారీరక ఎదుగుదల, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుకోడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

యోగాలో ఎన్నో ఆసనాలు, భంగిమలు ఉన్నా.. ఎక్కువమంది ఇష్టపడేది 'శవాసనం'. ఎందుకంటే ఎలాంటి కష్టం లేకుండా హాయిగా రిలాక్స్ కావచ్చు కదా..! మరి యోగా సెషన్ మొత్తం రిలాక్స్ కావడమే అయితే...? సాధారణ విశ్రాంతి భంగిమలకే కొంత యోగా ట్విస్ట్ ఇచ్చి అద్భుతమైన ఫలితాలను సాధించగలిగితే..? అలా వచ్చిందే 'రెస్టొరేటివ్​ యోగా'. ఈ మధ్యే పాపులర్ అవుతున్న ఈ ప్రత్యేకమైన యోగా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

ఎక్కడిదీ యోగా..?

1950ల్లో మన యోగ శాస్త్రాన్ని పాశ్చాత్య దేశాలకు ప్రచారం చేసిన బి.కె.ఎస్.అయ్యంగార్ ఈ రెస్టొరేటివ్ యోగాను కనిపెట్టారు. ఆయన శిష్యులలో మొదటితరం వారైన జుడిత్ హాన్సన్ లాసేటర్ ఈ రెస్టొరేటివ్ యోగాను ప్రచారంలోకి తీసుకువచ్చారు. 1955లో ఆమె రాసిన 'రిలాక్స్ అండ్​ రెన్యూ: రెస్ట్​ఫుల్​ యోగా ఫర్​ స్ట్రెస్​ఫుల్​ టైమ్స్​' అనే పుస్తకం ఇందుకు ఎంతగానో తోడ్పడింది. తర్వాత ఆమె రెస్టొరేటివ్ యోగాలో స్పెషల్ టీచర్ సర్టిఫికేషన్‌ కూడా ప్రవేశపెట్టారు.

రెస్టొరేటివ్ యోగా అంటే..?

మన శరీర తత్వాన్ని బట్టి, ఫ్లెక్సిబిలిటీని బట్టి రకరకాల యోగాసనాలను సాధన చేస్తాం. మనం ఆశించిన ఫలితాలను పొందడానికి, శరీరాన్ని నిత్యం ఆరోగ్యంగా ఉంచడానికి క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తుంటాం. అలాగే మానసిక ప్రశాంతత కోసం, ఏకాగ్రత కోసం ధ్యానాన్ని సాధన చేస్తాం. ఈ రెండిటి ప్రయోజనాలనూ ఏకకాలంలో అందించగలగడం రెస్టొరేటివ్ యోగా ప్రత్యేకత.

Restorative yoga
రెస్టొరేటివ్​ యోగా

యోగా చేసేటప్పుడు ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో ఉండడం వల్ల శరీరానికి ఆ భంగిమను నెమ్మదిగా అలవాటు చేస్తూ అందులోని పూర్తి లాభాలను పొందడమే రెస్టొరేటివ్ యోగా ఫార్ములా. శరీరానికి, మనసుకు విశ్రాంతినిస్తూనే అధిక బరువును తగ్గించడం రెస్టొరేటివ్ యోగా సక్సెస్ కావడానికి ప్రధాన కారణం. ఇందులో బాలాసనం చాలా ముఖ్యమైనది.

Restorative yoga
బాలాసనం

బాలాసనం..

తుంటి, తొడ, మోకాళ్లు, చీలమండల దగ్గర ఉండే కండరాలను బలపరిచి రక్త ప్రసరణను పెంచడానికి బాలాసనం ఎంతో ఉపయోగ పడుతుంది. ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. అంతేకాకుండా బాలాసనం సాధన చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వెంట్రుకల కుదుళ్లు బలంగా తయారవుతాయి.

Restorative yoga
రెస్టొరేటివ్ యోగా
Restorative yoga
బాలాసనం ఎలా చేయాలంటే?
Restorative yoga
రెస్టొరేటివ్​ యోగా ఉపయోగాలు

రెస్టొరేటివ్ యోగాను ప్రారంభించాలన్నా, ప్రాక్టీస్ చేయాలన్నా మొదటగా నిపుణుల పర్యవేక్షణ మాత్రం తప్పని సరి. జాగ్రత్తలు పాటిస్తూ.. మీరూ ప్రయత్నించేయండి మరి.

మరిన్ని యోగాసనాల కోసం ఈ కింది లింక్​లను క్లిక్​ చేయండి.

ఇవీ చదవండి: ఇలా చేస్తే తొడల దగ్గర కొవ్వు కరుగుతుంది!

అసహనం తగ్గాలంటే.. ఈ ఆసనాలు వేయాల్సిందే!

ఊపిరితిత్తులను బలోపేతం చేసే ఆసనాలు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.