కొందరికి తరచూ ఛాతీలో మంట వేధిస్తుంటుంది. ఈసీజీ వంటి పరీక్షలు చేసినా.. గుండె మామూలుగానే ఉంటుంది. ఎలాంటి సమస్య ఉండదు. అయినా నొప్పి, మంట వస్తూనే ఉంటాయి. దీనికి కారణం జీర్ణాశయంలోని రసాలు గొంతులోకి ఎగదన్నుకు రావటం. ఇలాంటి వారు రోజూ పరగడుపున రెండు చెంచాల పెరుగు తిని చూడండి. ఇది ఛాతీలో మంట తగ్గటానికి తోడ్పడుతుంది. అలాగే రోజుకు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలి. భోజనం చేసిన వెంటనే పడుకోవద్దు. కనీసం గంట సేపైనా ఆగాలి.
కొన్ని రకాల ఆహార పదార్థాలూ ఛాతీలో మంట, నొప్పిని ప్రేరేపించొచ్చు. మరీ ఎక్కువగా కారం, మసాలాలు తినకూడదు. వేపుళ్లు తగ్గించాలి. రోజూ వేళకు భోజనం చేయాలి. ఆహారాన్ని నెమ్మదిగా, పూర్తిగా నమిలి తినాలి. గబగబా మింగకూడదు. కూల్‌డ్రింకులు, కాఫీ, టీలోని కెఫీన్ సైతం ఛాతీ మంటను తెచ్చిపెట్టొచ్చు. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త అవసరం.
ఇదీ చూడండి..