ఆస్తమాతో బాధపడుతున్నవారు కొన్నిరకాల సహజమైన పద్ధతులతో అదుపులో ఉంచుకోవచ్చు. దగ్గు, ఆయాసం ఉన్నవారు ఇన్హేలర్ ద్వారా ఉపశమనం పొందుతుంటారు. అయితే సహజ పద్ధతుల ద్వారా కూడా ఆస్తమాను అదుపులో ఉంచుకోవచ్చు. అందుకు వైద్యులు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. మరి వైద్యులు ఇచ్చిన సలహాలు, సూచనలు మీకోసం..
నివారణ మార్గాలు..
- యోగ, ధ్యానం వంటివి చేయడం ఎంతో మంచిది.
- ఆహారంలో రంగురంగుల కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. అలాంటి వాటిలో బీ, సీ విటమిన్లు బీటా కెరోటిన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపు, మంట లక్షణాలను నిరోధిస్తాయి. అయితే ఆహార పదార్ధాలను నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్‌లను వాడుతారు. అవి ఆస్తమాను మరింత పెంచుతాయని మరువకూడదు.
- వేడి నీటి స్నానం ద్వారా కూడా ఆస్తమా లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే కొంతమందికి ఆవిరి వేడి వలన ఆస్తమా లక్షణాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
- అల్లం వెల్లులికి కూడా ఆస్తమా లక్షణాలను తగ్గించే శక్తి ఉంది. వేడి నీటిలో అల్లం, వెల్లుల్లి, లవంగాలు వేసి మరిగించి చల్లారాకా టీలా తాగాలి.
- కెఫిన్ ఉన్న పానీయం చాలా మేలు చేస్తుంది (4 గంటల వరకు ఊపిరితిత్తుల పనితీరును ఈ పానీయం మెరుగుపరుస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి)
- ఆస్తమా ఉన్నవారిలో చాలా మందికి అలర్జీలు ఉంటాయి. తమలో అలర్జీని పెంచుతున్న అంశాలేమిటో గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. పుప్పడి, దుమ్ములోని సూక్ష్మక్రిములు, పెంపుడు జంతువుల చుండ్రు వంటివి చాలా మందిలో అలర్జీని ఆస్తమాను పెంచుతుంటాయి.
పాటించాల్సిన ఆహారపు అలవాట్లు..
- అధిక కారం, మసాలాలు ఉన్న ఆహారాన్ని తక్కువగా తినాలి.
- రాత్తి భోజనం చేశాక పడుకునే ముందు ఒక గంట గ్యాప్ ఉండేలా చూసుకుంటే ఆస్తమాను అదుపులో పెట్టుకోవచ్చు.
- వేడి వాతావరణంలో వేడి పదార్థాలను మాత్రమే తినాలి.
- పాలు, గుడ్లు, చేపలు ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి.
- శరీరానికి సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి.
చేయాల్సిన వ్యాయామాలు..
- దీర్ఘశ్వాసతో కూడిన శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
- పొట్టభాగం కదిలేలా దీర్ఘశ్వాస తీసుకుని వదలాలి.
- వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చల్లదనానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- అధిక బరువున్న వారు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి.
- వ్యాయామం చేయాలనుకునేవారు వైద్యుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది.
- ఇవీ చదవండి:
- తల్లి కూడా చేయని మేలు.. ఉల్లితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
- గ్లోయింగ్ స్కిన్ కావాలా? మీ డైట్లో ఈ చిన్న మార్పులు చేస్తే సరి!