ETV Bharat / sukhibhava

ఆటిజం పిల్లలతో తల్లిదండ్రుల వ్యథా భరిత జీవితం! - మానసిక ఇబ్బందులు

బుద్ధి మాంద్యం, ప్రజ్ఙాలోపం, ఆటిజం లాంటి రుగ్మతలు ఉన్న పిల్లలు కుటుంబంలో ఉంటే తల్లిదండ్రులకు ఆత్మ న్యూనతాభావం ఏర్పడటం సహజం. అందరి కళ్లు వారిమీదే ఉండటం, ఇతరుల జాలి వారిని కుంగదీయవచ్చు. క్లినికల్ సైకాలజిస్ట్ ‘సమృద్ధి పట్​కర్’ ఆటిజం ఉన్న పిల్లల తల్లిదండ్రుల ఇబ్బందులకు కొన్ని పరిష్కారాలను సూచించారు.

Its Difficult For Parents To Accept A Child with Autism
ఆటిజం పిల్లలతో తల్లి దండ్రుల వ్యథా భరిత జీవితం..!
author img

By

Published : Apr 2, 2021, 4:45 PM IST

Updated : Apr 2, 2021, 6:53 PM IST

మనకు ఆకస్మికంగా కలిగే అవాంతరాలను ఎలా ఎదుర్కోవాలో మనం చదువుకున్న చదువు, మనచుట్టూ ఉన్న సమాజం నేర్పలేదు. అటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఆందోళన కలిగి మానసికంగా కుంగిపోతాం. మనందరం కొన్ని స్థిర నమ్మకాలతో, మానవ సంబంధాల గురించి కొన్ని ఊహాలతో జీవిస్తూ ఉంటాం. ఆటిజం ఉన్న పిల్లలు మన కుటుంబంలోనే ఉన్నారని తెలిస్తే దిగ్భ్రాంతికి గురవుతాం. ఇది ఊహించని పరిణామమే. భవిష్యత్ ఎలా ఉంటుందోనని, ఆ పిల్లలను ఎలా చూసుకోవాలోనని దిగులు పడటం సహజం.

జరుగుతున్న పరిణామాలను ఒప్పుకోవటం ఒక తప్పనిసరి దశ. ఇటువంటి ఎదురుచూడని పరిస్థితి వల్ల కుంగిపోవటం, మనసుకు సమాధానం చెప్పుకోవటం తరువాత నిజ జీవితాన్ని అనుభవించటం జరుగుతాయి. అయితే ఈ కుటుంబాలు వైద్య సహాయక వ్యవస్థతో సంభాషించటం చాలా అవసరం. దీన్ని ఒక జబ్బుగా కాక, ఆటిజం బిడ్డను ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిగా పరిగణించటం అనివార్యమవుతుంది.

వారి తల్లిదండ్రులకు కలిగే వ్యథ సహజంగా ఇలా కొన్ని దశల్లో సాగుతుంది.

  1. అవాక్కవ్వటం, తిరస్కరించటం: ఆటిజం ఉన్నట్టు వ్యాధి నిర్ధరణ అవ్వగానే తల్లిదండ్రులు వైద్యుని మాటలను సందేహిస్తారు. వైద్యులు మరింతగా పరీక్షించి కనిపిస్తున్న లక్షణాలకు వేరే కారణాలు చెబుతారని, పిల్లల ప్రవర్తన సమ ఈడు పిల్లల ప్రవర్తన కంటే భిన్నంగా ఉండటానికి మరేదైనా కారణం ఉండి ఉంటుందని భావిస్తారు.
  2. అపరాధభావన: తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి, ఈ విషాద పరిస్థితికి తానే కారణమని బాధ పడుతూ, తాము చేసిన తప్పులను నెమరువేసుకుంటూ అవే ఇందుకు కారణమనుకుని తల్లడిల్లుతూ ఉంటారు.
  3. కోపం: భిన్నమైన మానసిక స్థితులు కలుగుతూ కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ కోపం వారిపైనా, సమాజం పైనా భర్త/భార్య పైన, దేవుడి పైన కూడా కలుగుతుంది. అటువంటి కోపాన్ని అణచటం కంటే బహిరంగ పరచటమే ముఖ్యం. ఆ కోపం వెనుక ఎప్పటికీ శాంతించని బాధ, అన్నీ పోగొట్టుకున్న భావన ఉంటాయి. నాకే ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నించుకుంటారు.
  4. విషాదం: నియంత్రించుకోలేని బాధతో చివరకు ఏకాంత భావనకు, నైరాశ్యానికి, సంతానాన్ని పోగొట్టుకున్న భావనకు లోనవుతారు. ఇది ఒక అనివార్యమైన దశ.
  5. అంగీకరించటం: ఏది జరిగినా, ఎలా జరిగినా చివరకు దాన్ని అంగీకరించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రులు ఆటిజం పిల్లల వల్ల కలిగిన కొత్త బాధ్యతలను నిర్వర్తించటానికి ఒప్పుకుని వైద్యుల సహాయం కోరుతారు. కొన్ని పనులను ఇతరులకు అప్పగించి మార్చలేని పరిస్థితులకు తగ్గట్టుగా జీవించటం వారు ప్రారంభిస్తారు. వైద్య పరిచారికల సహాయ సహకారాలు పొందటం కూడా చేస్తారు.

ఈ అనివార్యమైన దశలన్నీ వారికొక కొత్త దృక్పథాన్ని అలవాటు చేస్తాయి. ఆటిజం పిల్లల శారీరక లోపాలను అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతారు. ఈ అన్ని దశలు దాటడం ఒక సహజ పరిణామం. ప్రతి కుటుంబం వారి వారి ప్రత్యేక పద్ధతుల్లో ఈ కష్టాలను ఎదుర్కొంటారు. పరిస్థితులను అర్థం చేసుకోవటానికి వారికి సమయం ఇవ్వాలి. ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా ఉంటుంది. ఒకరితో ఒకరిని పోల్చటం శ్రేయస్కరం కాదు.

ఆందోళన చెందకుండా కొంత విశ్రమించి ఈ రంగంలో పనిచేస్తున్న వారితో మాట్లాడి వారి అనుభవాలు తెలుసుకోండి. మనలా చాలా మంది ఉంటారు.

అదనపు సమాచారం కోసం సంప్రదించండి.

Samrudhi.bambolkar@gmail.com

Last Updated : Apr 2, 2021, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.