ETV Bharat / sukhibhava

పిల్లల ఆరోగ్యానికి, చురుకుదనానికి యోగా!

మా పిల్లలకు యోగా నేర్పవచ్చా? ఈ ప్రశ్న పెద్దల నుంచి తరచూ వినిపిస్తూ ఉంటుంది. అయితే పెద్దలు పిల్లలకు యోగా నేర్పడానికి సిద్ధంగా ఉన్నారా? పిల్లలకు యోగా నేర్పడం ద్వారా కలిగే లాభాలను పొందటానికి ఏం చేయాలో యోగా అధ్యాపకురాలు, ఫిజియోథెరపిస్ట్ అయిన డా. జాన్వీ కత్రానీ ఈటీవీ భారత్​కు వివరించారు.

author img

By

Published : Jun 3, 2021, 5:09 PM IST

Kids Yoga
పిల్లల ఆరోగ్యానికి, చురుకుదనానికి యోగా..!

శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గటానికి మానసిక ఒత్తిడి ప్రధాన కారణం. మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మన పిల్లలు కొవిడ్ వల్ల మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. యోగా వల్ల శ్వాసకోశాల్లో రక్త ప్రసరణ పెరిగి మన శరీరం లోపలి అవయవాలు చక్కగా పని చేస్తాయి. యోగా, దార్శనికం, వర్ణించిన పద్ధతులు ప్రాచీన కాలం నుంచి ఆదరణలో ఉంటూ ఆధునిక యోగాకు దారితీశాయి. శరీరం, మనసు, ఆత్మల సంయోగాన్ని వాటి క్రియలను శక్తిమంతం చేసుకునే మార్గం యోగా.

పిల్లలు సారవంతమైన నేల లాంటివారు. పెద్దలు వారికిచ్చే శిక్షణతో వారిని శక్తిమంతులుగా చేయవచ్చు. బాల్యం ఇతర వయసుల కంటే ఉత్సాహంగా ఉండే దశ. ఆ ఉత్సాహాన్ని సరైన దిశలో మళ్లించాలి. యోగాను పిల్లలకు బోధించటంలో చాలా మార్గాలున్నాయి. దాన్ని ఆటలతో లేదా కళలతో మిళితం చేయవచ్చు. అణకువ, మంచి అలవాట్లు, ఆహారం గురించి సరైన విచక్షణ, ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకోవటంలో చురుకుదనం మొదలైన ఎన్నో ప్రయోజనాలను యోగా ఇవ్వగలదు. సద్బుద్ధి, సామాజిక నైపుణ్యాలు, సామాజిక బాధ్యతలు, నీతి, విలువలు, కొత్త విషయాలను అధ్యయనం చేయటంలో నైపుణ్యం, మానసిక ఉద్వేగాలను నియంత్రించుకోవటంలో నేర్పు మొదలైనవన్నీ యోగా ద్వారా అబ్బుతాయి.

పిల్లలకు యోగా ఎలా అలవాటు చేయాలి?

ముందుగా, యోగాను పిల్లలకు అలవాటు చేయటంలో గల సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకుందాం.

  1. యోగాలో వివరించే యమ, నియమల ద్వారా పిల్లల్లో అణకువను నేర్పించటం.
  2. మానసిక ఉద్వేగాలను నియంత్రించుకుని సామర్థ్యాన్ని ఇచ్చే శిక్షణ.
  3. శరీర కండరాలపై, కదలికలపై నియంత్రణను సాధించే విధంగా శిక్షణనివ్వటం. యోగా ద్వారా సౌష్టవమైన శరీరం కలుగుతుంది.
  4. ప్రాణాయామ అనే క్రియ ద్వారా శ్వాసకోశాలను ఆరోగ్యవంతంగా ఉంచటం ద్వారా ఆక్సిజన్ వాయువును శరీరమంతా లభించే విధంగా చేయటం.
  5. ధ్యానం గురించి వారికి ప్రాథమిక పరిచయం చేసి అది ఎలా చేయాలో నేర్పటం. నిశ్శబ్ధంగా కాసేపు కూర్చోవటం కూడా ఇందులో భాగమే.
  6. ఉద్వేగాల నియంత్రణ పిల్లలకు అంతగా బోధపడని అంశమైనా మనసును అదుపులో ఉంచుకోవటానికి శిక్షణనివ్వటం.
  7. చిన్న వయసులో యోగాను తెలుసుకున్న పిల్లలు పెద్ద వయసులో విచక్షణ గల మనుషులుగా మారి చక్కటి భవిష్యత్తును నిర్మించుకోగలరు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.