ETV Bharat / sukhibhava

Cold: జలుబు చేసిందా... అయితే మంచిదే! - లాఫింగ్ గ్యాస్ ద్వారా డిప్రెషన్ తగ్గించొచ్చు...

బాగా జలుబు చేసినా తరచూ జలుబు చేస్తున్నా కొవిడ్‌ గురించి అంతగా భయపడక్కర్లేదు అంటున్నారు యేల్‌ యూనివర్సిటీ నిపుణులు. ఎందుకంటే జలుబుకి కారణమైన రైనో వైరస్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమైన యాంటీబాడీలు కొవిడ్‌కు కారణమైన సార్స్‌కోవ్‌-2 వైరస్‌నీ ప్రాథమిక దశలోనే గుర్తించి అడ్డుకుంటాయట. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే...

బలుబు మంచిదే, జలుబుతో కరోనా అంతం, జలుబెక్కువైనా ఆరోగ్యానికి మంచిదే

author img

By

Published : Jun 27, 2021, 11:56 AM IST

జలుబుకి కారణమైన రైనోవైరస్‌ లోపలకు వెళ్లగానే ఇంటర్‌ఫెరాన్స్‌ అనే జన్యు ప్రొటీన్లు దాన్ని పసిగట్టడంతో రోగనిరోధక వ్యవస్థ మేల్కొంటుంది. ఆతరవాత కొవిడ్‌ వైరస్‌ లోపలకు వెళ్లినప్పుడూ ఇంటర్‌ఫెరాన్లు తక్షణం స్పందిస్తాయి. అదీగాక కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన తొలి రెండు మూడు రోజుల్లోనే- అంటే, దాని లక్షణాలు బయటపడకముందే ప్రత్యుత్పత్తి చెందుతూ దాని సంఖ్యను పెంచుకుంటుంది. కానీ జలుబు వైరస్‌తో పోరాడేందుకు అప్పటికే అక్కడ ఉన్న రోగనిరోధక కణాలు సార్స్‌కోవ్‌నీ సమర్థంగా అడ్డుకోగలుగుతున్నట్లు గుర్తించారు పరిశీలకులు. అదే లోపల ఎలాంటి రైనోవైరస్‌ లేకుండా నేరుగా సార్స్‌కోవ్‌ సోకిన వాళ్లలో వైరస్‌ ఎక్కువగా వృద్ధి చెందుతున్నట్లు కనుగొన్నారు. అందుకే ఈ ఇంటర్‌ఫెరాన్‌ జన్యు ప్రొటీన్లను మందు రూపంలో ఇవ్వడం ద్వారానూ కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ తీవ్రతను తగ్గించవచ్చు అంటున్నారు. పైగా లోపల ఉన్న రెండు రకాల వైరస్‌ల మధ్య ఏం జరుగుతుందనేది కచ్చితంగా తెలియదు కానీ ఒక వైరస్‌ ఉన్నప్పుడు మరొకటి ఎక్కువగా వృద్ధి చెందడం లేదన్నది మాత్రం స్పష్టమైందట.

మూత్ర పరీక్షతోనే..!

మూత్ర పరీక్షతో క్యాన్సర్​ గడ్డల గుర్తింపు

తరచూ తలనొప్పి వస్తుంటే మెదడులో క్యాన్సర్‌ కంతులేమయినా ఉన్నాయేమోనని తెలుసుకునేందుకు వైద్యులు రకరకాల పరీక్షలు చేయిస్తారు. అయితే ఇక నుంచి వాటి అవసరం లేకుండా కేవలం మూత్ర పరీక్ష ద్వారానే మెదడులోని క్యాన్సర్‌ గడ్డల్నీ గుర్తించవచ్చు అంటున్నారు జపాన్‌లోని నగోయా విశ్వవిద్యాలయ పరిశోధకులు. పైగా వీటి ద్వారా ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తించవచ్చనీ దాంతో నివారించడం తేలికవుతుందనీ వాళ్లు అభిప్రాయపడుతున్నారు. మూత్రంలోని మైక్రోఆర్‌ఎన్‌ఏ జన్యుపదార్థాన్ని ప్రత్యేకంగా రూపొందించిన పరికరంతో పరిశీలించడం ద్వారా ఈ క్యాన్సర్‌ కంతుల్ని గుర్తించవచ్చు అంటున్నారు. అంతేకాదు, దీనిద్వారా ఇతరత్రా క్యాన్సర్లనీ కనిపెట్టవచ్చట. కాబట్టి భవిష్యత్తులో ఆసుపత్రికి వెళ్లకుండానే క్యాన్సర్‌ పరీక్షల్నీ చేయించుకోవచ్చన్నమాట.

అది... కొవిడ్‌ నుంచి రక్షిస్తుంది!

ఇవన్నీ తినడం వల్ల కరోనాను ఎదుర్కోవచ్చు

కొవిడ్‌ వైరస్‌ కారణంగా ఊపిరితిత్తులే ఎక్కువగా దెబ్బతింటున్నాయనేది తెలిసిందే. అయితే ఆ వైరస్‌ లోపలకు వెళ్లకుండా ఎలొవనాయిడ్స్‌ అనే ఓ రసాయనం అడ్డుకోగలదనీ ఇది ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాల్లో దొరుకుతుందనీ న్యూ ఆర్లీన్స్‌ న్యూరోసైన్స్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. కొవిడ్‌తో ఊపిరితిత్తులు దెబ్బతిన్న ఓ వృద్ధుడికి వీళ్లు ఈ రసాయనాన్ని ఎక్కించారట. అందులో సార్స్‌ కోవ్‌-2 వైరస్‌ ప్రొటీన్‌ ఊపిరితిత్తుల కణాలకు అతుక్కోకుండా చేయడమే కాక వాటిని లోపలకు రాకుండా కూడా అడ్డుకుందట. అంతేకాదు, ఊపిరితిత్తులు దెబ్బతినకుండా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రొటీన్ల ఉత్పత్తినీ పెంచిందట. కాబట్టి పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వుపదార్థాల నుంచి ఈ పదార్థాన్ని సేకరించి నేరుగా ఇంజెక్టు చేయడం ద్వారా కొవిడ్‌ను అడ్డుకునే ఆలోచన చేస్తున్నారు పరిశోధకులు. అంతేకాదు, ఈ ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే డ్రైఫ్రూట్స్‌నీ గింజల్నీ ఇతరత్రా ఆహారపదార్థాల్నీ ఎక్కువగా తినడం వల్ల కూడా ఫలితం ఉండొచ్చట.

ఆ గాలి సోకితే డిప్రెషన్‌ పరార్‌!

లాఫింగ్ గ్యాస్ ద్వారా డిప్రెషన్ తగ్గించొచ్చు...

డిప్రెషన్‌ బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అందుకే దీన్ని తగ్గించేందుకు నిపుణులు సైతం రకరకాల అంశాలను పరిశీలిస్తున్నారు. చికిత్సలో భాగంగా బాధితుల్ని లాఫింగ్‌ గ్యాస్‌(నైట్రస్‌ ఆక్సైడ్‌)కు గంటసేపు గురిచేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని తాజా పరిశీలనల్లో తేలిందట. ముఖ్యంగా కరోనా వల్ల జరిగిన నష్టం కావచ్చు, ఇతరత్రా ప్రమాదాలు సంభవించినప్పుడు కావచ్చు... ఆ విషాదం నుంచి కొందరు త్వరగా కోలుకుంటే, మరికొందరు ఎన్నేళ్లయినా దాన్ని మర్చిపోలేక కుంగుబాటుకి గురవుతారు. అలాంటి సందర్భాల్లో యాంటీడిప్రెసెంట్లే శరణ్యం. కానీ వాటివల్ల ఇతరత్రా దుష్ఫలితాలూ ఎక్కువే. అందుకే ఆయా మందుల మాదిరిగానే మెదడుమీద ప్రభావాన్ని కనబరిచే నైట్రస్‌ ఆక్సైడ్‌ను చికిత్సకు వాడటం మంచిది అంటున్నారు వాషింగ్టన్‌ యూనివర్సిటీ నిపుణులు. పైగా దీన్ని కొద్ది శాతంలో ఇచ్చినా సరిపోతుందనీ దీనివల్ల ఇతరత్రా దుష్ఫలితాలేమీ తలెత్తలేదనీ చెబుతున్నారు.

ఇదీ చూడండి: చరిత్రను మేలు మలుపు తిప్పిన రాజనీతిజ్ఞుడు 'పీవీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.