ETV Bharat / sukhibhava

టమాటాలు ఎక్కువకాలం ఫ్రెష్​గా ఉండాలా? - ఇలా చేస్తే చాలా రోజులు ఉంటాయి! - టమాటాలు ఎక్కువకాలం ఉండడానికి టిప్స్

How to Store Tomatoes : మనం నిత్యం వాడే కూరగాయల్లో అన్నింటికంటే టమాటాలు త్వరగా పాడవుతాయి. అలా కాకుండా ఉండాలంటే.. వాటిని సరిగ్గా స్టోర్ చేయాలి. అందుకోసం మేము కొన్ని టిప్స్ అందిస్తున్నాం. ఇవి పాటించారంటే.. ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

Tomato
Tomato Store Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 10:35 AM IST

Best Tips for Tomato Storing : ఒక కూరలో తోడుగా మరో కూరగాయను వేయాల్సి వస్తే.. అందరూ చూసేది టమాటా వైపే. దాని టేస్ట్​ కర్రీకి అడిషనల్ ఫ్లేవర్​ అందిస్తుంది. అందుకే.. చాలా మంది ప్రతి రోజూ చేసే వంటకాల్లో.. టమాటాను మాగ్జిమమ్ యూజ్ చేస్తుంటారు. టమాటాలు ఆరోగ్యంతోపాటు చర్మానికి మేని ఛాయను అందించడంలోనూ సహకరిస్తాయి. అందుకే టమాటాలను(Tomatoes) మిగతా కూరగాయల కంటే ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటారు. అయితే.. వాటిని నిల్వ ఉంచడమే అసలు సమస్య! సరిగ్గా స్టోర్ చేయకపోవడంతో.. త్వరగా పాడైపోతుంటాయి.

Tomato Store Tips for Long Time : ధర తక్కువగా ఉన్నప్పుడు సరే.. కానీ పెరుగుతున్నప్పుడు పరిస్థితి మొత్తం మారిపోతుంది. సామాన్యుడు కొనలేని పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటప్పుడు టమాటాలు త్వరగా పాడైపోయి, బయట పడేయాల్సి వస్తే ఇబ్బందిగా ఉంటుంది. డబ్బు వేస్ట్ అయిపోతుంది. అందుకే.. టమాటాలను చాలా కాలం తాజాగా ఉంచడం ముఖ్యం. దీనికోసం మేం చెప్పే టిప్స్ పాటిస్తే చాలు. మరి.. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పాలిథిన్ సంచుల్లో భద్రపరచండి : టమాటాలు తాజాగా ఉండాలంటే బాక్సుల్లో, పాలిథిన్ సంచుల్లో, ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. త్వరగా పాడవుతున్నాయని భావిస్తే.. వీటిని పాలిథిన్ సంచిలో భద్రపరుచుకుంటే ఎక్కువ కాలం ఫ్రెష్​గా ఉంటాయి. టమాటాలను చాలా కాలం స్టోర్ చేసుకోవడానికి పాలిథిన్ సంచులు బెస్ట్ ఆప్షన్.

పసుపు నీటిలో కడగండి : టమాటాలు త్వరగా పాడవకుండా ఉండాలంటే.. మార్కెట్​ నుంచి తెచ్చాక వాటిని పసుపు నీటిలో కడగాలి. ఆ తర్వాత గాలికి ఆరబెట్టాలి. ఇలా చేయడం ద్వారా అవి త్వరగా కుల్లిపోకుండా ఫ్రెష్​గా ఉంటాయి. ఈ పద్ధతిని అలవాటు చేసుకున్నారంటే.. మీరు తెచ్చిన టమాటాలు పాడవకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు.

Tomatoes for Skin problems: మీ ముఖంపై చర్మ సమస్యలా.. అయితే ఇంట్లోనే నివారించుకోండి..!

ఫ్రిజ్‌లో స్టోర్ చేయండి : టమాటాలను చాలా కాలం ఫ్రెష్​గా ఉంచడానికి మరో ఆప్షన్.. వాటిని ఎల్లప్పుడూ ఫ్రిజ్‌లో స్టోర్ చేయడం! బయట వాతావరణానికి టమాటాలు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల.. మీ ఇంట్లో ఫ్రిజ్ ఉంటే అందులో ఉంచండి.

బంకమట్టి ద్వారా స్టోర్ చేయెచ్చు : ఫ్రిజ్​ లేని వారు నేచురల్ పద్ధతిలో టమాటాలను నిల్వచేయడానికి బంక మట్టిని ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒక కంటైనర్ తీసుకొని దాన్ని మట్టితో నింపండి. ఆ తర్వాత టమాటాలను ఆ బంక మట్టిలో పూడ్చాలి. వీటికి నీరు అస్సలు తగలకూడదు. ఇలా మట్టిలో టమాటా నిల్వ చేసుకుంటే.. చాలా కాలం ఫ్రెష్​గా ఉంటాయి. ఇలా పైన పేర్కొన్న టిప్స్ పాటిస్తే.. మీరు కొనుగోలు చేసిన టమాటాలు దాదాపు నెలరోజుల కన్నా ఎక్కువగానే పాడవకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

Subsidy Tomatoes in AP అక్కడ టమాట కిలో రూ.50 లే..! రైతు బజారుకు క్యూ కట్టిన జనాలు..!

టమాటాతో లక్​.. కోటీశ్వరులుగా మారిన రైతులు.. నెల రోజుల్లో ఎంత సంపాదించారంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.