How to Solve Sexual Problems Between Wife and Husband : సంసారం హాయిగా సాగిపోవడంలో.. సెక్స్ పాత్ర ఎంతో కీలకం! అయితే.. మారిన జీవనశైలి, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, అనారోగ్యం వంటి కారణాలతో.. ఎంతో మంది శృంగార రసాన్ని సరిగా ఆస్వాదించలేకపోతున్నారని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి పరిస్థితుల్లో.. తమ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కొందరు మందులు వాడుతుంటారు. మరికొందరు ఏవేవో చిట్కాలు పాటిస్తుంటారు. వాటివల్ల సరైన ఫలితం లేకపోగా.. అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా ఎదుర్కొంటారు. ఇలాంటి వారు ఆయుర్వేదాన్ని నమ్మితే.. మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మరి.. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అశ్వగంధ.. మనలో చాలా మంది అశ్వగంధ పేరు వినే ఉంటారు. ఆయుర్వేదంలో దీనికి విశిష్ట స్థానం ఉంది. అయితే ఈ మూలిక వల్ల కలిగే లాభాల గురించి మాత్రం అంతగా తెలిసి ఉండదు. ముఖ్యంగా లైంగిక సమస్యలతో బాధపడేవారికి ఇది దివ్య ఔషదం అని చెప్పుకోవచ్చు. మహిళల్లో హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంతో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మూలిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించడమే కాదు.. లైంగిక శక్తిని మెరుగుపరుస్తుంది. పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంతో పాటు.. స్పెర్మ్ కౌంట్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
శతవరి.. ఈ మూలికకు సైతం ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం ఉంది. ఈ మూలికలో వంద వేర్ల బలం ఉంటుందని చెబుతారు. శతవరి అంటే 100 మంది పురుషుల బలం కలిగినది అని అర్థమట! ఈ మూలికను వాడడం వల్ల లైంగిక కోరికలు పెరుగుతాయట. దీని ద్వారా హార్మోన్ల సమస్య తగ్గిపోతుందని.. మోనోపాజ్ సమస్య అంత త్వరగా వేధించదని అంటున్నారు.
రోజులో ఎన్నిసార్లు సెక్స్ చేయొచ్చు? ఎక్కువైతే ఇబ్బందా?
త్రిఫల.. లైంగిక శక్తిని పెంచే మరో మూలిక త్రిఫల. సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో పురాతన కాలం నుంచి బహుళ ప్రయోజన చికిత్సగా దీన్ని ఉపయోగిస్తూ వస్తున్నారు. చాలా మంది ఈ మూలిక ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు. దీని పేరుకు తగ్గట్టుగానే ఈ మూలికలో.. ఆమ్లా, బిభిటకి, హరిటకి అనే మూడు రకాల ఔషధ మూలికలు ఉంటాయి. అందుకే త్రిఫలను 'పవర్‌ఫుల్ హెర్బల్' అని కూడా అంటారు. దీని వల్ల మీ సెక్స్ స్టామినా డబుల్ అవుతుందట.
గోక్షురా.. ఆయుర్వేదంలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే మరో అదిరిపోయే మూలిక గోక్షురా. ట్రిబ్యులస్ టెర్రెస్ట్రిస్ అని కూడా ఈ మూలికను పిలుస్తారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో పురుషుల శక్తిని మెరుగుపరచడానికి ఇది ప్రసిద్ధ మూలిక. సహజంగా టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచి.. లైంగిక శక్తిని పెంపొందిస్తుంది. అదేవిధంగా సహజమైన మూత్రవిసర్జనకారిగా గోక్షురాను చెప్పుకుంటారు.
లోధ్రా.. ఇక చివరగా లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడే మరో ఔషద మూలిక లోధ్రా. ఇది కూడా సెక్స్ స్టామినాను పెంచుతుంది. దీనిని వాడడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా హార్మోన్ బ్యాలెన్స్, అండాశయ కణాల మెరుగుదల, ఋతు చక్రాన్ని రెగ్యులేట్ చేయడంతోపాటు గర్భాశయం సమస్యల చికిత్సలోనూ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.