ETV Bharat / sukhibhava

How to Organize Your Fridge Right Way : మీ ఫ్రిడ్జ్​ను ఇలా ఉంచండి.. డోర్ ఓపెన్ చేసినోళ్లు వావ్ అంటారు..! - ఫ్రిడ్జ్​ నుంచి దుర్వాసన ఎందుకు వస్తుంది

How to Organize Your Fridge Right Way : ఈ కాలంలో దాదాపుగా ప్రతి ఇంట్లోనూ.. రిఫ్రిజిరేటర్ ఉంటుంది. అయితే.. చాలా ఇళ్లలోని ఫ్రిడ్జ్​లు దుర్వాసన వెదజల్లుతుంటాయి. దీనికి కారణం ఏంటో మీకు తెలుసా..? ఈ స్టోరీ చదవండి. మీ రిఫ్రిజిరేటర్​ను సూపర్​గా మెయింటెయిన్​ చేయండి.

How to Organize Your Fridge Right Way
How to Organize Your Fridge Right Way
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 4:17 PM IST

How to Properly Organize Your Fridge in Telugu : ప్రతీ ఇంట్లో ఉపయోగించే ముఖ్యమైన ఎలక్ట్రానిక్ వస్తువు.. ఫ్రిజ్(Fridge).​ పండ్లు, కూరగాయలు తాజాగా ఉండాలనే ఉద్దేశంతో అన్నీ ఇందులో పెడతారు. అయితే.. ఫ్రిడ్జ్​ను ఎల్లప్పుడూ తాజాగా ఉంచుకోవడంలో మాత్రం విఫలమవుతుంటారు. దాంతో.. ఫ్రిజ్ ఓపెన్ చేయగానే దుర్వాసన వెదజల్లుతుంది. అందుకే.. మేము చెప్పబోయే ఈ టిప్స్ పాటించండి. ఎప్పుడూ మీ రిఫ్రిజిరేటర్(Refrigerator) ఓపెన్ చేసినా.. చక్కగా క్లీన్​గా కనిపిస్తుంది. మరి, ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గడువు ముగిసిన పదార్థాలను తీసేయాలి : ఫ్రిజ్​లో పెట్టిన అన్ని వస్తువులనూ బయటకు తీసి.. అన్ని పదార్థాలను చెక్ చేసి గడువు ముగిసిన వాటిని తీసి బయట పడేయాలి. ఆ తర్వాత మిగిలిన పదార్థాలను ఏ ఐటమ్​కి ఆ ఐటమ్ వేరు చేసి వాటికి కేటాయించిన కంటైనర్లలో ఉంచండి.

బాగా శుభ్రం చేయండి : ఫ్రిజ్ నుంచి అన్ని వస్తువులనూ తీసినప్పుడు.. దానిని పూర్తి స్క్రబ్ చేయండి. వంటగది క్లీనింగ్​లో బాగా ఉపయోగపడే బేకింగ్ సోడా అన్ని వస్తువులను చాలా సులభంగా శుభ్రం చేస్తుంది. ఫ్రిజ్​లో ఒక మూలలో సన్నని రంధ్రాలున్న చిన్న డబ్బాలో బేకింగ్ సోడాను పెట్టడం ద్వారా చెడువాసనలు స్ప్రెడ్ కాకుండా ఉంటాయి.

ఫ్రిజ్ షెల్ఫ్‌లను క్రమబద్ధీకరించండి : మీ రిఫ్రిజిరేటర్ షెల్ఫ్​లను సరిగ్గా ఆర్గనైజ్ చేస్తే.. అది వ్యర్థాలను తగ్గించడంలో సహాయపడుతుంది. దాని ద్వారా ప్రతిదీ ఎక్కడ ఉందో మీకు కచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఆహార పదార్థాలను ఫ్రిజ్​లోని షెల్ఫ్​లలో దేనికదే అన్నట్టుగా.. సరైన పద్ధతిలో క్రమబద్ధీకరించాలి.

Fridge Storage Tips : వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. జర బీ కేర్​ఫుల్​

టాప్ షెల్ఫ్ : ఫ్రిజ్​లోని టాప్ షెల్ఫ్​లు సాధారణంగా వెచ్చగా ఉంటాయి. కాబట్టి తాజా ఉత్పత్తులను అక్కడ ఉంచవద్దు. మీరు తరచుగా ఉపయోగించే వాటిని అక్కడ స్టోర్ చేయండి.

మిడిల్ షెల్ఫ్ : దీనిలో పాల ఉత్పత్తులు, కూరగాయలను నిల్వ చేయండి. అవి సాధారణంగా బెర్రీలు వంటి మూత లేకుండా ఉంటాయి. మిడిల్ షెల్ఫ్ సాధారణంగా మూడింటిలో పొడవుగా ఉంటుంది. అందువల్ల మీరు ఇక్కడ పెద్ద, పొడవైన కంటైనర్‌లను ఉంచవచ్చు.

దిగువ షెల్ఫ్ : ఈ షెల్ఫ్​లో కచ్చితంగా తాజా వస్తువులను నిల్వ చేయాలి. ఎందుకంటే ఇది ఫ్రిజ్‌లోని కూలెస్ట్ భాగం కాబట్టి.. ప్రెష్ ఐటమ్స్​ను ఇక్కడ స్టోర్ చేసుకోవాలి.

డోర్ : డోర్ ఫ్రిజ్‌లో వెచ్చగా ఉండే భాగం. కాబట్టి.. మీరు ఇక్కడ మసాలా దినుసులను నిల్వ చేసుకోవాలి.

ఒకే విధమైన వస్తువులను కలిపి నిల్వ చేయండి : అంటే కూరగాయలకు సంబంధించిన వాటిని ఒక కంటైనర్​లో, పాల పదార్థాలకు సంబంధించిన వాటిని మరో కంటైనర్​లో.. ఇలా.. ఒకేరకమైన వస్తువులను ఒకే దగ్గర స్టోర్ చేస్తే.. దుర్వాసన రాదు. ఫ్రిజ్ కూడా క్లీన్​గా కనిపిస్తుంది.

పండ్లు, కూరగాయలు ఫ్రిజ్​లో ఉంచుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే

వెనుక భాగంలో పొడవైన వస్తువులను ఉంచండి : షెల్ఫ్​లలో ఆహార పదార్థాలను అమర్చేటప్పుడు, పొట్టి వస్తువులు ముందు వైపు, పొడవైన వస్తువులు వెనుక వైపు ఉంచాలి. అలా సెట్ చేయడం ద్వారా ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయో మీకు ఈజీగా తెలవడంతో పాటు సులభంగా తీసుకోవచ్చు.

ప్రతిదీ స్టాక్ చేయవద్దు : అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఇది. చాలా మంది నెలల తరబడి ఫ్రిజ్‌లో వస్తువులను నిల్వ ఉంచుతుంటారు. ఇలా చేయకండి. గడువు తీరినవి పడేయాలని ముందే చెప్పుకున్నాం. ఇక, ఫ్రిజ్‌లో కొంత భాగాన్ని ఖాళీగా ఉంచేలా చూసుకోవాలి. అంటే.. అవసరమైన దానికంటే ఎక్కువ కొనుగోలు చేసి.. ఫ్రిజ్​లు కుక్కేయొద్దన్నమాట. ఎక్స్​ట్రాగా ఉంటున్నవి ఏవో గుర్తించి.. వాటిని తగ్గించండి. ఇలా చేస్తూ.. పైన చెప్పిన టిప్స్​ పాటిస్తూ.. మీ ఫ్రిడ్జ్​ను చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటే.. దుర్వాసన రాదు. చూడడానికి కూడా నీట్​గా కనిపిస్తుంది.

ఫ్రిడ్జ్‌లో ఎక్కువకాలం వేటిని నిల్వ ఉంచకూడదో తెలుసా..?

కొత్త ఫ్రిజ్​ కొంటున్నారా?.. అయితే ఈ వివరాలు ఉన్నాయో లేదో చూసుకోండి!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.