ఆరోగ్యంగా ఉండాలంటే ఎత్తుకు తగిన బరువు ఉండటం చాలా అవసరం. లేదంటే శరీరం సమతుల్యత కోల్పోతుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరు ఉబకాయంతో బాధపడుతుంటే మరి కొందరు మాత్రం చాలా బక్కగా ఉన్నామని ఆవేదన చెందుతుంటారు. అసలు బరువు (weight gain) పెరగకపోవడానికి కారణాలు, సహజంగా బరువు ఎలా పెరగాలి (how to gain weight naturally) అనే ప్రశ్నకు నిపుణుల సమాధానం చూడండి.
ప్రశ్న: డాక్టర్ గారూ, నా వయసు 21 సంవత్సరాలు. నేను చాలా బక్కగా ఉంటాను. నా బరువు 35 కిలోలు. నేను ఎంత తిన్నా లావు అవటం లేదు. అందరూ బక్కగా ఉన్నావని హేళన చేస్తున్నారు. నేను లావు అవ్వాలంటే ఏం చేయాలి? అసలు లావు అవ్వకపోవడానికి కారణాలు ఏంటో తెలియజేయండి.
సమాధానం: లావు అవడం కన్నా బాడీ ప్రపోర్షనేట్గా ఉందా లేదా తెలుసుకోవడం ముఖ్యం. దానికోసం బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఎంత ఉందో చూసుకోవాలి. ఎత్తు, బరువుకు తగిన శరీరం ఉందా లేదా అని తెలుస్తోంది.
బరువు పెరగకపోవడానికి కారణాలు..
సరిగ్గా తింటున్నప్పటికీ అందులో పోషక విలువలు ఉండటం ముఖ్యం. ఇక థైరాయిడ్, షుగర్ లాంటి సమస్యలు ఉన్నాయో లేవో నిర్ధరించుకోవాలి. ఇవన్నీ చూశాకే మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలుస్తుంది.
సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యామాయాలు, నిద్ర, విశ్రాంతి తీసుకుంటే సాధారణంగా బీఎంఐ ఎలా ఉండాలో అంతే ఉంటుంది. వీటిల్లో ఏదైనా డీవియేషన్స్ వస్తే సమతూకం కోల్పోతే మానసిక ఒత్తిడి, థైరాయిడ్ లాంటి సమస్యలు రావొచ్చు. తొలుత వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతే బరువు పెరగడానికి ఓ మార్గం ఏర్పడుతుంది.
ఇవీ చూడండి: