'పురుషాంగం పెద్దగా ఉంటేనే మహిళ సంతృప్తి చెందుతుందా? సంభోగంలో విజేతలుగా నిలవాలంటే ఎంతసేపు సెక్స్ చేయాలి?' ఇవి పురుషులలో చాలా మందికి ఉండే అనుమానాలు! బెడ్‌పై విజృంభించాలని.. భాగస్వామికి మధురానుభూతి అందించాలన్న తపనతోనే ఈ అనుమానాలు వస్తుంటాయి. మరి, రతికేళిలో రాణించాలంటే పురుషాంగం సైజుకు ఉన్న ప్రాధాన్యం ఏంటి? అంగాన్ని పెంచుకునే మార్గాలు ఏవైనా ఉన్నాయా?
ముందుగా, రెండో అంశాన్ని పరిశీలిద్దాం. పురుషాంగాన్ని పెంచుకునేందుకు నిజానికి ఎలాంటి మార్గాలు లేవు. కొన్ని చికిత్సలు ఉన్నప్పటికీ.. వాటి వల్ల ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
"పురుషాంగం పెరగడానికి ప్రత్యేకంగా ఎలాంటి మందులు గానీ, ఇంజక్షన్లు గానీ ఆపరేషన్లు కానీ లేవు. కొన్ని చికిత్సల్లో పురుషాంగాన్ని లాగి ప్లాస్టర్ వేసే పద్ధతి ఉంటుంది. కానీ, స్తంభించినపుడు మాత్రం ఎప్పటిలాగే అదే సైజులో ఉంటుంది. మామూలు సమయంలో పురుషాంగం పెద్దదిగా లేదని అనుకోకూడదు. అసలు మామూలు సమయంలో పురుషాంగం ఏ సైజులో ఉంటే ఏముంది? కాబట్టి, పురుషాంగం సైజు పెంచేందుకు ఎలాంటి సర్జరీలు అవసరం లేదు. అంగం స్తంభిస్తుందా లేదా అన్న విషయాన్నే పరిగణలోకి తీసుకోవాలి."
-డాక్టర్ సమరం
ఇక, స్తంభించిన పురుషాంగం ఏ సైజులో ఉంటే మహిళ సంతృప్తికి లోనవుతుందనే విషయంపై చర్చిద్దాం. ఈ విషయంలోనూ అపోహలు అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. అంగం నాలుగున్నర అంగుళాలు ఉంటే సరిపోతుందని అంటున్నారు. కనీసం రెండు నిమిషాలు సెక్స్ చేయగలిగితే చాలని స్పష్టం చేస్తున్నారు.
"పురుషాంగం చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఒకే రకమైన తృప్తి లభిస్తుంది. అంగం స్తంభించినప్పుడు నాలుగున్నర లేదా ఐదు అంగుళాలు ఉంటే చాలు. మహిళకు యోని మార్గంలో కామనాడులు రెండు అంగుళాల వరకు మాత్రమే ఉంటాయి. కాబట్టి, అంగ పరిమాణాన్ని బట్టి తృప్తి ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫోర్‌ప్లే, క్లైటో స్టిమ్యులేట్ చేయడం వంటి చర్యల వల్ల మహిళకు ప్రేరణ కలుగుతుంది. స్తంభించిన పురుషాంగంతో కనీసం రెండు లేదా మూడు నిమిషాలైనా సెక్స్ చేయగలగాలి. సాధారణంగా మహిళలు మూడ్ వచ్చిన తర్వాత.. రెండు నుంచి మూడు నిమిషాల పాటు సెక్స్ కావాలని కోరుకుంటారు. ఆలోపే భావప్రాప్తి పొందుతారు. చాలా కొద్దిమంది మహిళలకే ఐదు నుంచి, పది నిమిషాలు సమయం పడుతుంది. కాబట్టి, అంగం సైజుతో సంబంధం లేదని గుర్తుంచుకోవడం ముఖ్యం."
-డాక్టర్ సమరం
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: