Best Home Remedies for Prevent Eyes Bloodshot : మన శరీరంలో అత్యంత సున్నితమైన, ముఖ్యమైన భాగాలలో కళ్లు ప్రధానమైనవి. అయితే.. చాలా మందిని సీజన్‌తో సంబంధం లేకుండా కళ్లు ఎరుపు(Bloodshot Eyes)గా మారుతూ ఇబ్బంది పెడుతుంటాయి. దీనికి అనేక కారణాలున్నాయి. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉన్నా.. బాడీ అధికంగా అలసిపోయినా కళ్ల ఎర్రబడతాయి. అంతేకాదు.. బయట తిరిగినప్పుడు దుమ్ము, దూళి వల్ల.. జలుబు వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, కొన్ని అలర్జీల కారణంగా కూడా కళ్లు(Eyes) ఎర్రగా మారుతాయి. ఈ సమస్యను ఈజీగా ఎలా తగ్గించుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కోల్డ్ కంప్రెస్ : మీ కళ్లు ఎరుపెక్కినప్పుడు తగ్గించుకోవడానికి ఉపయోగపడే అత్యంత ప్రభావవంతమైన మార్గం.. కోల్డ్ కంప్రెస్. ఇందుకోసం మీరు ముందుగా ఒక శుభ్రమైన క్లాత్ లేదా టవల్‌ను తీసుకోవాలి. దానిని చల్లటి నీటిలో ముంచి వాటర్ పిండుకోవాలి. ఆ తర్వాత మీ కళ్లు మూసుకొని రెప్పలపై 10-15 నిమిషాలు అప్లై చేసుకోవాలి.
కీరదోస ముక్కలు : కీరదోసతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అదే కీరదోసతో కల్లు ఎర్రబారడం, దురద, మంట సమస్యను కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం మీరు కీరదోసను పలుచని ముక్కలుగా కోసి.. వాటిని మీ మూసిన కళ్లపై 10-15 నిమిషాల పాటు ఉంచాలి.
టీ బ్యాగులు : టీ బ్యాగ్‌లు తాగడానికి మాత్రమే కాదు మీ కళ్ళలో మంట, ఎరుపును తగ్గించడంలో కూడా చాలా బాగా సహాయపడతాయి. ఇందుకోసం మీరు బ్లాక్ టీ బ్యాగ్‌లను తీసుకొని వాటిని వేడి నీటిలో నానబెట్టి చల్లార్చుకోవాలి. ఆ తర్వాత వాటిని మీ మూసిన కళ్లపై 10-15 నిమిషాలు ఉంచాలి.
We care about eye care : మీ కళ్లు ఆరోగ్యంగా ఉన్నాయని అనుకుంటున్నారా..!
రోజ్ వాటర్ : మీ కళ్లు ఎర్రబారడాన్ని ఈజీగా తగ్గించుకోవడానికి రోజ్ వాటర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సహజ నివారణిగా పనిచేస్తాయి. దీనికోసం మీరు శుభ్రమైన కాటన్ బాల్‌ను రోజ్ వాటర్‌లో నానబెట్టాలి. ఆ తర్వాత దాన్ని మీ కళ్లపై పెట్టి 10-15 నిమిషాలు అలా ఉంచాలి.
కళ్లకు వ్యాయామం : మీకు ఎర్రటి కళ్లు అలసట లేదా ఎక్కువసేపు స్క్రీన్ చూడడం కారణంగా ఏర్పడినట్లయితే వాటికి విరామం ఇవ్వడానికి కొన్ని కళ్లకు సంబంధించిన వ్యాయామాలు ప్రయత్నించాలి. అంటే కొన్ని సెకన్ల పాటు వేగంగా కన్ను రెప్పవేయడం, తెరవడం వంటి వ్యాయామాన్ని అనేకసార్లు రిపీట్ చేయాలి. ఇలా చేయడం ద్వారా కంటిపై ఒత్తిడి వల్ల కలిగే ఎరుపును తగ్గించవచ్చు.
చేతులు శుభ్రంగా : మీ చేతులను తరచుగా కడుక్కోవడం వల్ల కూడా కంటి ఇన్ఫెక్షన్‌లను తగ్గించుకోవచ్చు. రోజులో ఎన్నోసార్లు చేతులతో ముఖం, కళ్లను టచ్ చేస్తాం. కాబట్టి.. చేతులు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పైవన్నీ చేసినా సమస్య అలాగే ఉంటే.. డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఇవి తింటే మెరుగైన కంటిచూపు మీదే! విటమిన్ ఏ లభించే పదార్థాలివే