ETV Bharat / sukhibhava

నీళ్లు తాగితే.. ఈ సమస్యలుండవట! - నీళ్లు తాగడం వల్ల లాభాలు

Health tips : నీరు.. మన శరీరంలోని అన్ని జీవక్రియలకు అవసరమైనది. సరిపడినన్ని నీళ్లు తాగితే మనకెదురయ్యే సగం ఆరోగ్య సమస్యలను ఇట్టే తగ్గించుకోవచ్చట! ముఖ్యంగా కరోనా బారిన పడకుండా ఉండడానికి కూడా తగినంత నీరు తాగడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.

DRINKING LOTS OF WATER CAN REDUCE ILLNESS
నీళ్లు తాగితే.. ఈ సమస్యలుండవట!
author img

By

Published : Jan 29, 2022, 6:02 AM IST

Health tips : కిడ్నీలో రాళ్లు, అధిక బరువు వంటి సమస్యలు కూడా తక్కువ నీరు తాగడం వల్లే ఉత్పన్నమవుతాయి. ఇవన్నీ తెలిసినా.. నీళ్లు తాగడానికి ఇష్టపడని వారు చాలామందే ఉంటారు. రోజు మొత్తంలో కలిపి లీటరు కంటే ఎక్కువ నీరు తాగని వారు ఎందరో అంటే అది అతిశయోక్తి కాదేమో..! అందుకే నీళ్లు తాగడానికి కాస్త భిన్నమైన మార్గాలను వెతుక్కోవడం ద్వారా ప్రత్యేకించి ఈ వేసవిలో శరీరంలో నీటి మోతాదు తగ్గకుండా జాగ్రత్తపడచ్చు. తద్వారా బరువు తగ్గడం మాత్రమే కాదు.. ఎన్నో సమస్యల నుంచి దూరంగా ఉండే వీలుంటుంది.

బరువును బట్టి..

  • ఒక అంచనా ప్రకారం- మన బరువులో ప్రతి 20 కిలోలకు లీటర్ చొప్పున నీటిని తాగాలట. అంటే ఉదాహరణకు- మీరు 60 కిలోల బరువుంటే సుమారు 3 లీటర్ల నీటిని తాగాలన్నమాట. అలాగే రోజూ కొన్ని వేళల్లో నీళ్లు తాగడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తూన్నారు.. అవేంటంటే..
  • ఉదయం లేవగానే తప్పనిసరిగా రెండు గ్లాసుల నీళ్లు తాగాలన్నది నిపుణుల సలహా. దీనివల్ల అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి.
  • టిఫిన్ లేదా భోజనం ఇలా ఏ ఆహారానికైనా అరగంట ముందు గ్లాసు నీళ్లు తాగాలి. దీనివల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.
  • స్నానం చేసే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలి. దీనివల్ల రక్తపోటు రాకుండా కాపాడుకోవచ్చు.
  • రాత్రి పడుకోవడానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ.

ఇలా దాదాపు లీటరున్నర వరకూ తాగే వీలుంటుంది. కానీ మిగిలిన నీటిని తాగడం మాత్రం మర్చిపోతుంటారు చాలామంది. అందుకే దానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి..

అందంగా తయారుచేస్తే..

ఏదైనా అందంగా, కంటికి ఇంపుగా ఉంటే ఆ పని ఇట్టే చేయాలనిపిస్తుంది. సాధారణంగా జిమ్‌కి వెళ్లడం ఇష్టం లేని వారికి కూడా అందమైన ట్రాక్‌సూట్ కొనుక్కుంటే దాన్ని వేసుకోవాలన్న ఆత్రుత జిమ్‌కి పరిగెట్టిస్తుంది. అలాగే అందంగా సర్దుకున్న డెస్క్ పనిలో ఉత్సాహాన్ని పెంచుతుంది. ఇదే సూత్రం నీటికి కూడా వర్తిస్తుంది. అందుకే ఒక అందమైన రంగురంగుల లేదా మీకు నచ్చిన ఆకారంలో ఉన్న బాటిల్‌ని కొనుక్కోండి. దాని నిండా నీటిని నింపి మీకు ఎదురుగా పెట్టుకోండి. దీనివల్ల మీరు నీరు తాగే అవకాశాలు మెరుగవుతాయి. దాన్ని చూసినప్పుడల్లా మీకు నీళ్లు తాగాలన్న విషయం గుర్తొస్తుంది.

ఫ్లేవర్ కలపండి..

'నీటికి ఎలాంటి రుచి ఉండదు కాబట్టి తాగాలనిపించదు' అని చాలామంది అనుకోవడం సహజం. ఇలాంటప్పుడు నీటికి కొన్ని రకాల ఫ్లేవర్లను జోడించడం ద్వారా దాన్ని రుచిగా మార్చి, సులభంగా తాగేందుకు ప్రయత్నించవచ్చు. అయితే దీనికోసం మార్కెట్లో దొరికే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లను కలపాల్సిన అవసరమేమీ లేదు. ఇంట్లోనే అందుబాటులో ఉన్న పండ్లతో నీటికి నోరూరించే రుచి తీసుకురావచ్చు. నీటిలో పండ్లు లేదా పుదీనా వంటి ఆకులు కలిపి కూడా వాటికి రుచిని తీసుకురావచ్చు. దీనికోసం పుదీనా, పుచ్చకాయ ముక్కలు, స్ట్రాబెర్రీలు, కీరా వంటివాటిలో ఏదైనా ఎంచుకొని దాని ముక్కలను నీటిలో వేసి ఫ్రిజ్‌లో పెడితే సరి. పండ్లలో ఉన్న పోషకాలతో పాటు వాటి రుచి కూడా నీళ్లలోకి చేరిపోతుంది.

ఆకలి వేసినప్పుడు..

మన శరీరం కొన్నిసార్లు దాహాన్ని సైతం ఆకలిగా భావిస్తుందట. అందుకే మనకు దాహం వేసినప్పుడల్లా ఆకలేసినట్లుగా అనిపించి ఎక్కువగా తినేస్తుంటాం. దీనివల్ల అనవసరమైన క్యాలరీలు శరీరంలోకి చేరి, మరింత లావవుతాం.. అందుకే ఆకలిగా అనిపించినప్పుడల్లా కొన్ని నీళ్లు తాగి చూడండి. ఆపై పది నిమిషాలు ఆగండి. ఒకవేళ మీ ఆకలి తగ్గిపోతే ఫర్వాలేదు. లేదంటే మాత్రం ఏదైనా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఇలా చేయడం వల్ల బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చు. ఆకలేసినప్పుడల్లా నీటిని తాగడం వల్ల బరువును కూడా తగ్గించుకోవచ్చు.

నీటితో ఆట..

నీళ్లు తాగడాన్ని ఒక పనిలా భావిస్తే అది కొన్నాళ్లకే బోర్ కొట్టే అవకాశం ఉంటుంది. అందుకే రోజూ తాగే నీటికి తోడుగా మరిన్ని నీళ్లు తాగేందుకు ఓ చక్కటి పద్ధతిని పాటించవచ్చు. ఒక చిన్న పని పూర్తయితే చాలు.. కొన్ని నీళ్లు తాగేయండి. కాస్త పెద్ద పనిని పూర్తిచేస్తే గ్లాసు నీటిని గటగటా తాగవచ్చు. అంతేకాకుండా.. ప్రతి గంటకు ఒక గ్లాసు నీరు తాగడం తప్పనిసరి చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన రూల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక నీళ్లు తాగాలని మీకు గంటకోసారి గుర్తు చేయడానికి వివిధ రకాల యాప్స్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: heartbeat rate : గుండె గుండెకో వేగం.. వేగాన్ని బట్టి ఆరోగ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.