అల్లంతో కలిగే ప్రయోజనాలు
అల్లం వికారాన్ని తగ్గిస్తుంది. శరీర బరువుని తగ్గించడంలోనూ కీలకంగా పనిచేస్తుంది. జలుబు, దగ్గు, శ్వాస ఇబ్బందులను నియంత్రిస్తుంది. ఈ కాలంలో జలుబు బారిన పడకుండా ఉండటానికి అల్లం బాగా పనిచేస్తుంది. అల్లం ముక్కల్ని నీళ్లల్లో వేసి మరిగించి దానికి చెంచా తేనె కలిపి తాగితే ఎంతో మేలు.
నెలసరి సమయంలో అల్లం తీసుకోవడం వల్ల అప్పుడు వచ్చే నొప్పులు నియంత్రణలో ఉంటాయి. అలాగే అధిక రక్తస్రావాన్ని అరికట్టే సుగుణాలు దీనిలో ఉన్నాయని చెబుతున్నాయి పరిశోధనలు. కీళ్ల నొప్పులకూ చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం అల్లానికి రక్తపోటుని నియంత్రించే శక్తి ఉంది. కడుపు ఉబ్బరాన్నీ, గ్యాస్ సంబంధిత సమస్యల్నీ అదుపులో ఉంచుతుంది.
ఇదీ చూడండి: కరోనాతో మరో ఏడాది సహజీవనం తప్పదా?